Saturday, June 7, 2025
spot_img

పిచ్చి అభిమానం.. జీవితం అంధకారం..

Must Read

ప్రాణాలు తీస్తున్న పిచ్చి అభిమానం

అభిమానం హద్దులు దాటితే భవిషత్తు అంధకారమే


  • ఇటీవల తరచూ జరుగుతున్న ప్రమాదాలు పిచ్చి అభిమానానికి నిదర్శనంగా మారుతున్నాయి

ఒకప్పుడు అభిమానం అనేది ఆదరణ, ప్రేమ, గౌరవం అనే భావాలతో నిండిన ఒక పవిత్రమైన పదంగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఇది విచక్షణ కోల్పోయిన, భయానక పరిణామాలను తెచ్చే “ఫ్యానిజం”గా మారుతోంది. అభిమాని అనబడే వ్యక్తి పరిమితి దాటి వెళ్లినప్పుడు, అది మనోరోగ లక్షణంగా మారుతోంది. మన దేశంలో ఇటీవల జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

*పుష్ప ప్రమోషన్ ఈవెంట్ – కుటుంబం చిన్నాభిన్నం

  • హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో, సెలబ్రిటీని చూసేందుకు వచ్చిన వేలాది మంది తొక్కిసలాటకు గురయ్యారు. ఒక మహిళ అక్కడే మరణించింది. ఆమె కుమారుడు ఇంకా కోమాలో ఉన్నాడు. సెలెబ్రిటీలను చూసేందుకు జనం ఎగబడడం, భద్రతా చర్యలపై ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యం… ఇవన్నీ కలిసి ఒక కుటుంబాన్ని చీకటిలోకి నెట్టేశాయి. బెంగళూరులో క్రికెటర్లు విజయోత్సవ ర్యాలీ – గెలుపు తర్వాతి విషాదం

ఐపీఎల్ విజయం అనంతరం బెంగళూరులో జరిగిన క్రికెట్ ర్యాలీలో, స్టేడియం వరకు వెళ్లేందుకు ప్రయత్నించిన వేలాది మందిలో తొక్కిసలాట జరిగింది. 11 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆట గెలిచిన ఆనందాన్ని సెలబ్రేట్ చేయడం కోసమే ప్రాణాలను పణంగా పెట్టాలా?

బాధ్యత ఎవరిది?

ఇలాంటి సంఘటనల్లో బాధ్యత ఎవరిది?

గుడ్డిగా సెలెబ్రిటీలను ఆరాధించే అభిమానులదా?

భద్రత చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ యంత్రాంగాలదా?

ప్రోగ్రాములు నిర్వహించేవారి మౌలిక సదుపాయాల లోపమా?

ఎవరి తప్పైనా… బాధితులు మాత్రం సాధారణ ప్రజలే. తాము చేయని తప్పుకు జీవితాన్ని కోల్పోవడం ఎంత బాధాకరం!

*ఫ్యానిజం – అభిమానం కాదు, మనోవ్యాధి!

అభిమానం అంటే ప్రేరణ, ఆదర్శం. కానీ ఫ్యానిజం అంటే వ్యక్తి తన జీవితాన్ని మరచిపోయి మరొకరిలా తన జీవితాన్ని జీవించడమే. ఇది ఓ మానసిక వ్యాధిలా మారుతోంది.

ఫ్యానిజం లక్షణాలు:

✓వ్యక్తిత్వం కోల్పోవడం:
నేను ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం లేకుండా, “నేను ఫలానా సెలబ్రిటీ అభిమాని” అనే లిమిటెడ్ గుర్తింపు.

✓జీవిత లక్ష్యాలను మర్చిపోవడం:
చదువు, కెరీర్, కుటుంబ బాధ్యతల కంటే – సినిమా రిలీజ్, హీరో వచ్చేది ఎప్పుడూ అనే విషయాలకే ప్రాధాన్యత.

✓ఆనుకరణాత్మక జీవితం:
సెలబ్రిటీ స్టైల్, డైలాగ్‌లు, దుస్తులు, మాట్లాడే తీరు… అన్నీ కాపీ పేస్ట్.

✓ఆరోగ్యంపై ప్రభావం:
నిద్రలేకుండా వీడియోలు చూడటం, గంటల తరబడి వేచి ఉండటం, భోజనం మర్చిపోవడం – ఇవన్నీ శరీరానికీ మనసుకీ హానికరం.

విదేశాల్లో అభిమాన సంస్కృతి ఎలా ఉంటుంది?
ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టును గౌరవించేందుకు వాళ్ల దేశ ప్రజలు పెద్దగా రోడ్డెక్కలేదు. న్యూజిలాండ్, అమెరికా వంటి దేశాల్లోనూ ఇదే దృక్కోణం. అక్కడ అభిమానాన్ని ఆచరణాత్మకంగా, సమతులితంగా చూపుతారు.

అభిమానం వాళ్లకు ఒక “అనుభవం”, మన దేశంలో అది “బానిసత్వం”గా మారుతోంది. అక్కడ సెలబ్రిటీలు దేవుళ్లలా కాదు, ప్రజల భాగస్వాముల్లా ఉంటారు.

మీ జీవితానికి – మీరే హీరో!

ఒకరిని చూసి ఊగిపోవడం ముందు ఒకసారి ఈ ప్రశ్న వేసుకోండి:

” నేను నా జీవితానికి ఏం చేస్తున్నాను?”*

మీరు కూడా ఒక రంగంలో మేటి కాదా కావచ్చు?
మీరు కూడా హీరోలే అవవచ్చు కదా?

వాళ్లు ప్రయత్నించారు – క్రికెటర్లు అయ్యారు.

వాళ్లు పట్టుదలతో ఉన్నారు – నటులు అయ్యారు.

వాళ్లు దారులు వెతికారు – నాయకులు అయ్యారు.

మీరూ ప్రయత్నిస్తే ఎందుకు సాధించలేరు?

వాళ్ల విజయాలను చూసి స్ఫూర్తి పొందండి, కానీ జీవితాన్ని వాళ్ల కోసం త్యాగం చేయడం తప్పు.

అభిమానం కావాలి మార్గదర్శకం

అభిమానం గుడ్డిగా కాకూడదు. అది జ్ఞానంతో, వివేచనతో, స్పష్టతతో ఉండాలి.
సెలెబ్రిటీలను కాకుండా – స్వీయ ప్రతిభను అభిమానించండి!

మీ జీవిత విజయాల కోసం శ్రమించండి. మీ కుటుంబం కోసం, సమాజం కోసం, దేశ భవిష్యత్తు కోసం మీరు మేటిగా మారండి.

అప్పుడే – దేశానికి యువ శక్తి అవసరమైన దిశలో కదలుతుంది.

మీరు ఎవరినైనా అభిమానించాలనుకుంటే– మీరు మిమ్మల్నే అభిమానించండి.
మీ లక్ష్యాలను, కష్టాలను, స్వప్నాలను గౌరవించండి.
జీవితంలో మీరే హీరోగా నిలబడండి – ఎవరో సెలబ్రిటీ కోసం మీ విలువైన జీవితం తాకట్టు పెట్టొద్దు!

యువత మారితేనే – దేశం మారుతుంది.
అభిమానం తెలివిగా ఉండాలి – పిచ్చిగా కాదు!

  • జి.అజయ్ కుమార్
Latest News

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS