Saturday, July 26, 2025
spot_img

గంగా-జమునా సంగమంలాంటి నాయకుడు దత్తాత్రేయ

Must Read

హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కొనియాడిన డా. వకుళాభరణం

హర్యానా మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ఉదయం నల్లకుంట కూరగాయల మార్కెట్ ప్రాంతంలో బీసీ ఉద్యమకారుడు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు నివాసానికి స్వయంగా వచ్చి తన ఆత్మకథ పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. “డా. వకుళాభరణం బీసీ ఉద్యమానికి, బీసీ వర్గాల అభివృద్ధికి నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. బీసీ కమిషన్ ఛైర్మన్‌గా ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి,” అని ప్రశంసించారు.

అనంత‌రం డా. వకుళాభరణం మాట్లాడుతూ.. “దత్తాత్రేయ హైదరాబాద్ సంస్కృతిలో గంగా-జమునా సంగమంలాంటి విలువలతో జీవించే నాయకుడు. అలాంటి వ్యక్తి మా ఇంటికి స్వయంగా రావడం మా కుటుంబానికి గౌరవకరమైన విషయం,” అని తెలిపారు. హైదరాబాద్‌ సంస్కృతిలో గంగా-జమునా సంగమంలాంటి విలువలతో జీవించే నాయకుడు. మతపరమైన, కులపరమైన భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడటం ఆయనకు ముద్రలాంటిది. సత్ప్రవర్తన, పరిశుద్ధత, నిరహంకారంతో నిబ‌ద్ద‌త రాజకీయ జీవితం కొనసాగించడం చాలా అరుదైన విషయం. అలాంటి నాయకుడు మా ఇంటికి స్వయంగా రావడం మా కుటుంబానికి గౌరవకరమైన క్షణం,” అని అన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ, వకుళాభరణం దంపతులను శాలువాతో సత్కరించి, శ్రీకృష్ణ కాంస్య విగ్రహం మరియు తన ఆత్మకథ పుస్తకాన్ని అందించారు. వకుళాభరణం కూడా దత్తాత్రేయకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.

కార్యక్రమంలో డా. వకుళాభరణం సతీమణి సుధా శ్రీ, కుమారుడు ప్రహల్లాద్ కూడా పాల్గొన్నారు. అనంతరం దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి సుమారు ఒక గంటపాటు స్నేహపూర్వకంగా ముచ్చటించారు. తెలంగాణలో సామాజిక న్యాయం, బీసీ వర్గాల సంక్షేమం, హైదరాబాద్ అభివృద్ధి, యువతకు మార్గదర్శకత వంటి అంశాలపై చర్చ కొనసాగింది. కుటుంబ అనుభవాలను, వ్యక్తిగత స్ఫూర్తిదాయక సంఘటనలను పంచుకుంటూ దత్తాత్రేయ పుస్తకం రాసిన వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఈ పుస్తకం ద్వారా తన జీవితపు విలువలు, ప్రజా జీవన దిశ, సాధించిన అనుభవాలు యువతకు తెలిసి, వారి జీవితాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Latest News

పిజి ఈసెట్‌, లాసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణలో పిజి ఈసెట్‌, లాసెట్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్‌ 1నుండి 9 వరకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS