సేవ్ ద గర్ల్ చైల్డ్ ఆధ్వర్యంలో చేయూత
సేవ్ ద గర్ల్ చైల్డ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆశా కిరణ్ చిల్డ్రన్ హోం విద్యార్ధినీలకు వారి చదువుకు సంబంధించిన పుస్తకాలు, పెన్నులు ఇతర సామాగ్రి అందించారు. వీరికి చంచల్ గూడ జైలు ఎస్పీ శివ కుమార్ పర్యవేక్షణలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యులు డా. స్రవంతి, డా. శ్రీవాణి, ప్రగతి పాల్గొని విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ సంస్థ నుండి బాలికలు, మహిళల రక్షణ కోసమే కాకుండా, చదువుకోవాలనుకునే చిన్నారులకు చేయూత ఇస్తున్నాం అన్నారు. బాలికల భద్రత కోసం ప్రతి ఒక్కరూ పట్టుబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోమటి రమేష్ బాబు, బత్తిని రాజేష్, నరేందర్ హోం నిర్వాకులు పాల్గొన్నారు.