- యశోదా న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల
- అరుదైన ఆపరేషన్ తో ప్రాణాలు నిలిపిన యశోద వైద్యులు
వెన్నునొప్పి సాధారణమేనని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని మలక్ పేట యశోద ఆస్పత్రి ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో మలక్ పేట యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత కాలంలో వెన్నునొప్పి సర్వసాధారణమైనప్పటికీ, స్పాండిలోసిస్ సమస్యగా పరిగణించి డాక్టర్లు ఏవో మందులతో సరిపెడతారని కానీ నొప్పి రోజుల తరబడి వేధిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగు కారణాలను కనుక్కోవాలని అన్నారు. లేనిపక్షంలో వెన్నులో ట్యూమర్లు ఏర్పడి, ప్రాణాంతక వ్యాధిగా మారి అవకాశం ఉందని అన్నారు.
ఇటీవల కాలంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన గోన సరిత అనే పేషంట్ తమ హాస్పిటల్ లో చేరగా పరీక్షించి ట్యూమర్ ఏర్పడంతో చాలా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి ట్యూమర్ తొలగించడంతో అతి తక్కువ సమయంలోనే తిరిగి కోలుకోగలిగిందన్నారు. ఏమాత్రం ఆలస్యం జరిగిన ఆమెకు తీవ్ర నష్టం జరిగి ఉండేదని అన్నారు. యశోద ఆసుపత్రిలో ఉన్న అధునాతన సౌకర్యాలతో, తక్కువ ధరలోనే వైద్య సౌకర్యం అందుబాటులో ఉందని దీనిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పేషెంట్ సరిత మాట్లాడుతూ వైద్యులు అందించిన వైద్యం గురించి, తీసుకున్న శ్రద్ధ గురించి వివరిస్తూ ఇక జీవితంలో నడవలేని అనుకున్న తనను 15 రోజుల్లోనే నడిపించారని వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కే శ్రీనివాస్ రెడ్డి, జి ఎం శ్రీనివాస్, చిదుర, వాసు కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.