- నిజాయితీకి మారుపేరైన స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి చర్యలు ఎక్కడ…!
- 100 ఎకరాల గ్రీన్ బెల్ట్ లో వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు..
- చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది..?
- గ్రీన్ బెల్టు 63 ఎకరాలను మింగేసిన ఘనుడు.. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి!
- కాలంచెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు, రిజిస్ట్రేషన్లు..!
- నిర్మాణ అనుమతులు తీసుకున్నది సర్వే నెంబర్ 125లో..
- భారీ కమర్షియల్ నిర్మాణం సాగిస్తోంది గ్రీన్ బెల్ట్ 124లో..
- ప్రధాన రహదారిని మింగేస్తున్న అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మాజీ కౌన్సిలర్..
- ముడుపులు తీసుకుని ఫిర్యాదులను మూటగట్టి అటకెక్కించిన దౌర్భాగ్యం..
- మున్సిపల్, విజిలెన్స్, ఏసీబీ నిఘా విభాగాలు దృష్టి పెడితే భారీ అవినీతి వెలుగు చూస్తుంది..
‘‘ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన టౌన్ ప్లానింగ్
వెబ్సైట్లు, టి ఎస్ బి పాస్, బిల్డ్ నౌలో
పారదర్శకత లేకపోవడమే
ఈ అక్రమాలకు ప్రధాన కారణంగా
మేధావులు విశ్లేసిస్తున్నారు ’’

పాడిందే పాడరా అని ఒక సామెత చెబుతారు పెద్దలు.. చెప్పిందే చెబుతూ, రాసిందే రాస్తూ.. కొంతైనా అవినీతిని కట్టడి చేద్దాం అనుకుంటూ పోతుంటే.. అసహనం ఏర్పడుతోంది.. సిస్టం మీద నమ్మకం పోతోంది.. జరుగుతున్న అక్రమాన్ని అనేక సార్లు వెలుగులోకి తీసుకుని వస్తున్నా.. ఫలితం శూన్యంగానే మిగిలిపోతోంది.. బడంగ్ పేట్ మున్సిపాలిటీలో బి.ఆర్.ఎస్. పార్టీకి తలవంపులు తెస్తున్న స్థానిక 24 వ వార్డు కౌన్సిలర్ ఏనుగు రామిరెడ్డి.. 100 ఫీట్ల రోడ్డును ఆక్రమించి భారీ అక్రమ నిర్మాణదారులతో చేతులు కలిపి, పార్టీ పెద్దల పేరు చెప్పి, మున్సిపల్ అధికారుల పేరు చెప్పి, మీడియా పేరు చెప్పి లక్షలు వసూలు చేసి అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు.. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించడం.. ఇంటి నెంబర్లు తెచ్చుకోవడం.. రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. ఇదే తంతు జరుగు తోంది.. తప్పుడు రియల్ దందా యథేచ్ఛగా సాగు తోంది.. దీనికి అడ్డుకట్టవేసే వారు లేకపోవడంతో వారు ఆడిరదే ఆట, పాడిరదే పాటగా నడిచిపోతోంది.. బడంగ్ పేట్ గ్రీన్ బెల్ట్ పరిధిలో వెలుగు చూసిన అంతం లేని కబ్జా భాగోతం ఇది..
ఈ కార్పొరేటర్ కాలం ముగిసిపోయింది.. మాజీ ఈయన అక్రమ వసూళ్లకు మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు.. కేవలం అవినీతి అనే పదాన్ని తన ఇంటిపేరుగా మార్చుకుని అక్రమార్జనే లక్ష్యంగా అవినీతిని నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ ప్రధాన రహదారిని మింగేసి.. అక్రమ నిర్మాణాలకు తనవంతు సహకారం అందిస్తూ.. ఆక్రమ నిర్మాణ దారుల నుండి పార్టీ పెద్దల పేరు చెప్పి, మున్సిపల్ అధికారుల పేరు చెప్పి, మీడియా పేరు చెప్పి లక్షల్లో ముడుపులు వసూలు చేసి మున్సిపల్ ఖజానాకు గండి కొట్టి, లక్షల కోట్లు సంపా దిస్తూ బడంగ్ పేట్ బీఆర్ఎస్ పార్టీకి తలొంపులు తెస్తున్నాడు బడంగ్ పేట్ 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రామ్ రెడ్డి.. ఈయనపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనం, సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు..

భవిష్యత్తు మానవ మౌలిక వసతులు వివిధ అంశాలకు అనుగు ణంగా అప్పటి భవిష్యత్తు పట్టణ ప్రణాళిక నిపుణులు బడంగ్పేట్ మున్సిపాలిటీలో గల ఓప్రాంతాన్ని గ్రీన్‌జోన్‌గా ప్రకటించారు. ఇక్కడ గ్రీన్ జోన్ అంటే పార్కులు, పాఠశాలల కోసం ఏర్పాటు చేసిన స్థలం..అయితే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ స్థానిక కౌన్సిలర్ ఏనుగు రామిరెడ్డి తప్పుడు డాక్యు మెంట్లతో కాలం చెల్లిన గ్రామ పంచాయతీ లేఔట్, హౌస్ నెంబర్లతో మున్సి పాలిటీలో ముడుపులు చెల్లించి, హౌస్ నెంబర్లు మంజూరు చేయించుకుని, అక్రమంగా ఇండ్లను నిర్మించి, భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, వాటిపై అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసి, అంతు లేని అవినీతికి పాల్పడ్డారనడానికి సాక్షీభూతం ఈవార్త కథనం..
బడంగ్ పేట్ మున్సిపాలిటీ 24వ వార్డు, సర్వేనెంబర్ 122, 123, 124, 129లలో అల్మాస్ గూడా విలేజ్, బాలాపూర్ మండల్.. ఇది పూర్తిగా గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్ జోన్.. దాదాపు ఈ స్థల విస్తీర్ణం 63 ఎకరాలుగా ఉంటుంది. దీని మీద అక్రమ పద్ధతిలో, వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టి, అమాయకపు ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితి దాపురించింది.. భవిష్యత్తులో హైడ్రా లాంటి సంస్థ ఏదైనా ఈ స్థానిక నివాసాలపై చర్యలు తీసుకుంటే అక్కడ కొన్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది అన్నది యదార్ధం..

బడంగ్ పేట్ 24వ వార్డు అల్మాస్ గూడా, గ్రీన్ బెల్ట్ ఆనుకుని 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డును ఆక్రమించి, మున్సిపల్ అనుమతులు లేకుండా, భారీ కమర్షియల్ బిల్డింగ్ లను నిర్మించి మున్సిపల్ ఆదాయానికి కోట్ల రూపాయలు గండి కొడుతున్నారు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి..
సర్వేనెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం..
ఫైల్ నెంబరు 004449/బీపీ/డీటీసీపీ/3037/0009/2023, పర్మిట్ నెంబర్ 0015/బీపీ/3037/2023..
అల్మాస్ గూడా, సర్వే నెంబర్ 125, ప్లాట్ నెంబర్ 556లో పర్మిషన్.
ప్రస్తుతం నిర్మిస్తున్నది 124 ఓపెన్ స్పేస్ (గ్రీన్ బెల్ట్) సర్వే నెంబర్లో..
అనుమతులు ఒకచోట.. నిర్మాణం మాత్రం గ్రీన్ బెల్ట్ లో.. స్థానిక కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి సదరు బిల్డింగ్ యజమానితో లక్షల్లో ముడుపులు తీసుకుని దగ్గరుండి అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేస్తున్న దారుణ పరిస్థితి దాపురించింది.. ఈ అవినీతి తతంగాన్ని గతంలో వార్తలు రాసి ఫిర్యాదు చేసి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరు గుతుందో అర్ధం కానీ దారుణ పరిస్థితి నెలకొందని చెప్పాలి…!

ఈ అవినీతి, అక్రమాలపై.. అక్రమ నిర్మాణాలపై ఎస్టిఎఫ్ ఇంచార్జ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక జనం వేడుకుంటున్నారు…
బడంగ్పేట్ మున్సిపాలిటీలో భవిష్యత్తు ప్రజల ఉపయోగాల కోసం, గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్‌గా కేటాయించిన వివరాలు :
24 వ వార్డులో 63 ఎకరాలు.. (వార్డు నెంబర్ 4) అల్మాస్ గూడ విలేజ్, సర్వేనెంబర్ 84, 85, 86 ఓపెన్ స్పేస్ (గ్రీన్ బెల్ట్) గా 28 ఎకరాలు నిర్ణయించబడ్డాయి.. (వార్డు నెంబర్ 30) బడంగ్ పేట్, సర్వే నం 148,149 ఓపెన్ స్పేస్ 17 ఎకరాలు (గ్రీన్ బెల్ట్) గా నిర్ణయించబడ్డాయి.. కాగా దాదాపు 100 ఎకరాల స్థలాన్ని మాస్టర్ ప్లాన్ లో భవిష్యత్తు ప్రజల అవసరాల కోసం.. ఆట స్థలాలు, పార్కుల కోసం ప్రభుత్వం కేటాయిం చింది..

ఈ విషయంపై అందరికీ అవగాహన ఉన్నా.. దీనిలో గృహ నిర్మాణానికి హౌస్ నెంబర్లు.. తద్వారా రిజిస్ట్రేషన్లు.. ఎలా జరుగుతున్నాయన్నది మిస్టరీగా మారింది.. అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని, అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది.. ఈ విషయంపై.. బడంగ్ పేట్ మున్సిపల్ ఇంచార్జ్ స్పెషల్ ఆఫీసర్.. పి. శ్రీనివాస్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించి.. ఈ భారీ అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనం, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు..