Friday, July 18, 2025
spot_img

దేవాదాయ భూములు బిల్డర్స్ కి అప్పగింత

Must Read
  • మాకెందుకులే అంటున్న రెవెన్యూ శాఖ అధికారులు
  • పొంతలేని అధికారుల తీరు..
  • దేవాల‌య భూముల‌ను ర‌క్షించాలంటున్న స్థానికులు
  • అక్ర‌మార్కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌

మణికొండ మున్సిపల్ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామంలోని గణేష్ దేవాలయానికి చెందిన విలువైన భూములు సర్వే నంబర్లు 112, 116, 125లు కనుమరుగవుతూ ఉన్నాయి. కాగా, 2015లో అప్పటి దేవాదాయ శాఖ, రాజేంద్రనగర్ ఎం.ఆర్.ఓ., డిప్యూటీ కలెక్టర్ సమక్షంలో 28 ఎకరాలు 25 గుంటలు గణేష్ దేవాలయానికి చెందినవే అని ఫైల్ నెంబర్ డి/1350/2015 ద్వారా కోర్టులో ధృవీకరించారు. అప్పటి నుండి వివిధ కోర్టు కేసులు నడుస్తున్నాయి. కానీ ఈ భూములను కాపాడాల్సిన ఎండోమెంట్ ఈ.ఓలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, భూకబ్జాకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల ఆ భూములు ఇతరుల చేతికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. బాధ్యత తీసుకున్న వారు ప్లాట్ లు చేస్తున్న మౌనంగా ఉండి వారిచే ముడుపులు తీసుకుని శతగోపం పెట్టారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నటుగా మొత్తం ప్రైవేటు పరం చేసి నిర్మాణాలకు పూర్తిగా సహకారం అందించారు.

గతంలో పని చేసిన అధికారులు, రెవెన్యూ శాఖ, ఇండోమెంట్, హెచ్ఎండిఏ అధికారులు చేసిన పనికి ఇప్పుడు వచ్చిన ఎండోమెంట్ అధికారులు తలలు పట్టుకొని ఏమి చేయాలో అర్థం కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా అధికారులను సంప్రదించి అడ్డుకునే ప్రయత్నం గా కొన్ని రోజుల క్రితం సంయుక్తంగా సర్వే చేశారు. రెవెన్యూ అధికారులు, ఎండోమెంట్ అధికారులకు సహకారం అందించడం లేదు అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ అధికారులు, సబ్ రిజిస్టర్ గండిపేట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో దాదాపు కబ్జా చేసిన బిల్డర్స్ ఓపెన్ స్థలం లో హైడ్రా సర్వే చేసిన తర్వాత కొన్ని నిర్మాణాలు జోరు అందుకున్నాయి.

కొందరు దేవాలయం ఎదురుగా ప్రహరీ గోడ నిర్మాణం చేసి హైడ్రా అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఏది ఏమైనా దేవాదాయ శాఖ అధికారులు అలసత్వం, రెవెన్యూ శాఖ మౌనం, సబ్ రిజిస్టర్ కాసుల వర్షంలో తడిసిన తీరు, గుడ్డిగా పర్మిషన్ లు ఇస్తున్న హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా దేవాదాయ భూములు మాయం చేస్తున్న మాయగాళ్లకు పూర్తిగా సాకారం అందించడంతో కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్న చందంగా ఎండోమెంట్ భూమి మీద పెత్తన దారులు ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స‌ర్వే నెంబ‌ర్లు మారుస్తూ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్లు వేస్తూ రిజిస్ట్రేషన్స్ చూపిస్తున్నారు. ఎటువంటి లింకు డాక్యూమెంట్స్ చూడకుండా హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు వీరికి నిర్మాణానాలకి ఎలా అనుమతులు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

Latest News

అదరగొట్టిన భారత మహిళల జట్టు

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విజయం సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS