Wednesday, August 20, 2025
spot_img

ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ డియోగో జోటా మృతి

Must Read

స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డియోగో జోటా గురువారం మృతి చెందాడు. మార్కా నివేదిక ప్రకారం సనాబ్రియాలోని జమోరా ప్రాంతానికి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోర్చుగల్‌లోని పెనాఫీల్‌కు చెందిన డియోగో జోటా తన సోదరుడు ఆండ్రీతో కలిసి ట్రవెల్‌ చేస్తున్న టైంలో ప్రమాదం జరిగింది. వారు వెళ్తున్న క్రమంలోనే కారు ప్రమాదానికి గురైంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల ధాటికి చుట్టుపక్కల ప్రదేశం కూడా ఎఫెక్ట్‌ అయినట్టు స్థానికులు చెబుతున్నారు. డియోగో జోటాకు పది రోజుల క్రితమే రూట్‌ కార్డోసోతో వివాహమైంది. డైలీ మెయిల్‌ ప్రకారం, కాస్టిల్లా, లియోన్‌ ప్రాంతంలోని పోలీసు వర్గాలు కూడా ఈ ప్రమాదాన్ని నిర్దారించాయి.

‘‘జమోరాలోని సెర్నాడిల్లా మునిసిపాలిటీలోని 52 65 కి.మీ. వద్ద వాహనం ప్రమాదానికి గురైనట్టు 1-1-2 కాస్టిల్లా వై లియోన్‌ ఆపరేషన్స్‌ రూమ్‌కు చాలా కాల్స్‌ వచ్చాయి. కారు ప్రమాదంలో చిక్కుకొని కాలిపోయినట్లు చెప్పారు’’ అని ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ‘‘అక్కడి నుంచి, మోంబుయ్‌ హెల్త్‌ సెంటర్‌ నుంచి మెడికల్‌ ఎమర్జెన్సీ యూనిట్‌, ప్రైమరీ కేర్‌ మెడికల్‌ స్టాఫ్‌ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. స్పాట్‌లోనే ఇద్దరు వ్యక్తుల మరణించినట్టు నిర్ధారించారు.’’ పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య చీఫ్‌ పెడ్రో ప్రోయెంకా ఈ ఘటనపై స్పందించారు. ‘‘ఈ ఉదయం స్పెయిన్‌లో డియోగో జోటా, ఆండ్రీ సిల్వా మరణించారని తెలిసింది. ఇది పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య, మొత్తం పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌కు తీరని నష్టం.’’ అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

‘‘చాలా కాలంగా డియోగో జోటా అద్భుతమైన ఆడగాడు. జాతీయ జట్టుకు దాదాపు 50కుపైగా ట్రోఫీలు అందించాడు. డియోగో జోటా ఒక అసాధారణ వ్యక్తి, అన్ని సహచరులు, ప్రత్యర్థులను గౌరవించేవాడు. నా తరపున, పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య తరపున, డియోగో, ఆండ్రే సిల్వా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’’అని అన్నారు. జూన్‌ 28న రూట్‌ కార్డోసోను జోటా వివాహం చేసుకున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం అతను ప్రాణాలు కోల్పోవడం ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS