Thursday, July 31, 2025
spot_img

మసకబారుతున్న పసి(డి) బతుకులు..

Must Read

నిధులు గుటకాయస్వాహా.. విధులకు ఎగనామం..

బడి పిల్లల బతుకుల్లో వెలుగులు నింపాల్సిన ఉపాధ్యాయులు కొందరు తీవ్రమైన నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిట్యాల పురపాలిక పరిధిలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిధులను గుటకాయ స్వాహా చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నందున పసి(డి) పిల్లల బతుకులు మసకబారుతున్నాయి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పిఎంశ్రీ) పథకం కింద రెండవ విడత తో ఈ పాఠశాల ఎంపిక అయింది. ఆధునిక మౌలిక సదుపాయాలతో పాఠశాలను అభివృద్ధి పరచాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14500 పాఠశాలల్లో పిఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకం కింద చిట్యాల ఉన్నత పాఠశాల కు 2024-25 సంవత్సరానికి గాను రూ.6,73,190 లు మంజూరయ్యాయి.

పేరుకే బతుకమ్మ సంబరాలు.. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు ఏవి..

అయితే ఏ రకమైన తీర్మానాలు లేకుండానే హెచ్ఎం గోగికార్ మాధవి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఖర్చు చేయకుండానే నిధులు మొత్తం స్వాహా చేసి బిల్లులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. స్కూల్ గ్రాంట్స్ కింద రూ.75 వేలు మంజూరైనా ఉపాధ్యాయులకు కనీసం కూర్చోవడానికి కుర్చీలు లేవు.. బడి పిల్లల అసెంబ్లీకి మైకు సదుపాయం లేకపోవడం విడ్డూరం. న్యూస్ పేపర్ మ్యాగజైన్ ల కోసం రూ.12,600 చెలిమి కోసం రూ.4వేలు మంజూరు అయ్యాయి కానీ మ్యాగజైన్లు మరియు చెలిమి పుస్తకాల ఊసులేదు. అడపాదడపా ఒక పేపర్ మాత్రం వస్తుంది. పాఠశాల విద్యార్థులను విజ్ఞానయాత్ర (ఎక్స్ పోజర్ విజిట్) కు తీసుకు వెళ్ళేందుకు రూ.2 లక్షల దాకా మంజూరయ్యాయి. అయితే సదరు ప్రధానోపాధ్యాయులు 8, 9, 10 వ తరగతి విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులతో పాటు వెళ్లినప్పటికీ ప్రధానోపాధ్యాయులు తనతో పాటు ముగ్గురు భౌన్సర్లను అయిదుగురు అపరిచిత వ్యక్తులను తీసుకెళ్లి గోల్కొండ కోట గేటు బయటనే ఫోటోలు తీయించి టూర్ ను మమ అనిపించారు. జూపార్క్ ఊసు లేనే లేదు.. అసెంబ్లీ కి తీసుకెళ్లి అక్కడి అధికారులతో తాను సన్మానం చేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకా బతుకమ్మ పండుగ కు రూ.20 వేలు, ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కు రూ.10వేలు, ఫైనాన్షియల్ లిటరసీ కోసం రూ.20 వేలు, పాఠశాల వార్షికోత్సవానికి రూ.50 వేలు, ఇలా ఇంకా చాలా నిధులు వచ్చాయని విద్యాశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇందులో కూడా చాలా వరకు చిరునామా లేవు.. కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చి ముగించారు.

పీఎం శ్రీ కింద సెకండ్ ఫేస్ కింద ఎంపికైన పాఠశాల లో కూర్చోవడానికి కుర్చీలు కూడా సరిగ్గా లేవు..

‘బోధనకు దూరం..’
ప్రస్తుతం ఎఫ్ఏసి హెచ్ఎం ఉన్న గోగికార్ మాధవి వాస్తవంగా పాఠశాల లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ కూడా. అయినప్పటికీ ఎప్పుడూ విద్యార్థులకు పాఠాలు చెప్పరని పదవ తరగతి విద్యార్థులు సంబంధిత మండల విద్యాధికారి కి ఫిర్యాదు చేశారు. ఒక రోజు డిఇఓ ఆఫీస్, ఇంకో రోజు ఎస్టీఓ ఆఫీస్, మరో రోజు బ్యాంకు పని అని అసలు విధులకు ఆన్ డ్యూటీ పేరుతో డుమ్మా కొడుతున్నారని తెలుస్తోంది.

గోల్కొండ కోట వెలుపల ఉపాధ్యాయులు, విద్యార్థులు..

‘పాఠశాలకు ఏటీఎల్’
చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా మంజూరైంది. 21వ శతాబ్దపు శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఈ పథకం నీరుగారింది. బడి కి మంజూరైన ల్యాప్ ట్యాప్,టెలిస్కోప్, డ్రోన్స్ వంటివి పాఠశాలలో అందుబాటులో లేవని తెలుస్తోంది. గతంలో మంజూరయిన పాఠశాల నిధులు కూడా జిరాక్స్ ల కోసం ‘టీ’ ల కోసం ఖర్చు చేసినట్లు కాకి లెక్కలతో సరిపెట్టినా ఆడిట్ అధికారులు మాత్రం పట్టించుకోకుండా ఆమోదించారు. ఇంకా పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను అనధికారికంగా నరికేసి విక్రయించారని.. పాత సామాగ్రి అంటూ చాలా పుస్తకాలు, కంప్యూటర్ యూపిఎస్ లు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

భౌన్సర్లు..అనధికార వ్యక్తులతో కలసి అసెంబ్లీ యాత్ర

‘మిథ్యా’హ్న భోజనం:
బడి పిల్లల హాజరుశాతాన్ని మెరుగు పరుస్తూ పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్నభోజనం కాస్త ఈ పాఠశాలలో మిథ్యగా మారింది. భోజనం రుచి చూడాలన్న నెపంతో ప్రధానోపాధ్యాయులు బడికి వచ్చినప్పుడల్లా కోడి గుడ్లు తో ఫుల్ గా భోజనం చేయటం చూసిన వారు ఎవరైనా ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరు పిల్లలు ఇంటి నుండి భోజనం తీసుకువచ్చినా సరే వారికి సైతం వండి పెడుతున్నట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. పాఠశాలలో తగిన తాగునీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల మౌనం వీడి విద్యార్థుల పురోభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

నరికి వేసిన వృక్షాలు

వివరణ
తనపై వచ్చిన అభియోగాలపై ప్రధానోపాధ్యాయురాలు గోగికార్ మాధవి వివరణ ఇస్తూ..‘తాను ఒక రూపాయి వస్తే వంద రూపాయలు ఖర్చు చేస్తానని, అసలే లెక్కలు ట్యాలీ అవ్వక ఇబ్బంది పడుతున్నానని ఇంతవరకు బ్యాంకు స్టేట్ మెంట్ కూడా తీసుకోలేదు.. నిధులు పక్కదారి పట్టిన విషయం అవాస్తవం’అన్నారు. వివరణ సమయంలో ఆమె తో పాటు ఉన్న మాజీ హెడ్మాస్టర్ కె.కరుణాకర్ రెడ్డి కూడా స్పందిస్తూ నిధుల దుర్వినియోగం జరిగితే ఆడిట్ లో తేలుతుందన్నారు. కాగా వీరిపై పాఠశాలకు విరాళంగా ఇచ్చిన ఖరీదైన ప్రింటర్ ను ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి..

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS