Friday, June 6, 2025
spot_img

BRAOUలో HHCM కోర్సు

Must Read

ఎంబీఏలో హాస్పిటల్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌(HHCM‌) కోర్సును ప్రవేశపెట్టడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BRAOU) హైదరాబాద్‌లోని 3 విద్యా సంస్థలతో అవగాహహన ఒప్పందాలను కుదుర్చుకుంది. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో మంగళవారం (జూన్ 3న) నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సమక్షంలో ఈ ఒడంబడికలు జరిగాయి.

అపోలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, కిమ్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ, దారుస్సలాం ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ సంబంధిత పత్రాలపై సంతకాలు చేశాయి. కార్పొరేట్‌ వైద్య రంగంలో అనేక మార్పులు వస్తున్న నేపథ్యంలో మాస్టర్ ఆఫ్ బిజెనెస్‌ అడ్మినిస్ట్రేషన్(MBA)లో భాగంగా ఈ కోర్సును అందిస్తామని ఘంటా చక్రపాణి చెప్పారు. ఈ కోర్సు చేసినవారికి ఉపాధి అవకాశాలు బాగుంటాయని తెలిపారు. ఈ కోర్సులను అందించేందుకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు.

Latest News

గుడ్డులో ఏమేం ఉంటాయి?

గుడ్లు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే.. వీటిలో పోషకాలు సంవృద్ధిగా ఉంటాయి. ఒక గుడ్డులో సుమారు 70 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్, 5...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS