Thursday, July 31, 2025
spot_img

సునామీతో భారీగా ఎగిసిపడ్డ అలలు

Must Read
  • తీరానికి కొట్టుకు వచ్చిన తిమింగలాలు
  • జపాన్‌ తీర ప్రాంతాన్ని అప్రమత్తం చేసిన అధికారులు

సునామీ దెబ్బకు భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకొచ్చి పడ్డాయి. రష్యా లో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. పసిఫిక్‌ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్‌ను కూడా తాకింది. సముద్రంలో కల్లోలం తీవ్రతకు నీటి మధ్యలో ఉండాల్సిన భారీ తిమింగలాలు తీరంలోకి విసిరేసినట్లు పడ్డాయి. జపాన్‌లోని చింబా తీరంలోని దృశ్యాలు వైరల్‌గా మారాయి. మరోవైపు ఇప్పటికే రేడియేషన్‌ లీకేజీతో సమస్యాత్మకంగా మారిన ఫుకుషిమా డయీచీ అణుకేంద్రం నుంచి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఇప్పటికే జపాన్‌లోని పసిఫిక్‌ తీరంలో ఉన్న కొన్ని దీవులను సునామీ అలలు చేరుకొన్నాయి. టొకచాయ్‌ పోర్టులో 40 సెంటీమీటర్ల అలలు రాగా.. ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి.

దీంతోపాటు థోకు, కాంటో ప్రాంతాల్లో కూడా భారీ అలలు కనిపించాయి. హన్సంకిలో 30 సెంటీమీటర్ల ఎత్తున అలలు వచ్చినట్లు ఎన్‌హెచ్‌కే పేర్కొంది. ఇషినోమొకి పోర్టులో 50 సెంటీమీటర్ల అలలు వచ్చాయి. ఇక తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న జపాన్‌ ఎయిర్‌ పోర్టులు కూడా సునామీ హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. ఈశాన్య జపాన్‌లోని సెండాయ్‌ విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ ప్రాంతానికి వచ్చే విమానాలను దారి మరల్చారు. జపాన్‌ తీరంలో, 2011 మార్చిలో 9.0 తీవ్రతతో వచ్చిన శక్తిమంతమైన భూకంపం భారీ సునామీకి కారణమయ్యింది. ఆ సమయంలో సముద్ర అలలు 130 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఎగిశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ విపత్తులో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. మరో 2500 మంది ఆచూకీ లేకుండా పోయింది. 1.20 లక్షల ఇళ్లు పూర్తిగా నాశనం కాగా, 2.7 లక్షల నివాసాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి.

ఫుకుషిమా న్యూక్లియర్‌ ప్లాంటు కూడా దెబ్బతింది. దీంతో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిని భారీగా రేడియేషన్‌ లీకైంది. దీంతో కొన్నేళ్లపాటు ఈ ప్రదేశం మొత్తం కలుషితమైంది. దీనిని శుభ్రం చేయడానికి.. కలుషితమైన నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేయడానికి సుదీర్ఘకాలం పట్టింది. మొత్తం జపాన్‌ వద్ద శుద్ధి చేసినట్లు చెబుతున్న 1.34 మిలియన్‌ టన్నుల అణుజలాలు పోగుబడ్డాయి. వాటిని వివిధ దశల్లో శుద్ధి చేసి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ పక్రియ పూర్తికావడానికి 30 ఏళ్లు పడుతుందని అంచనా. ఈ అణుజలాల్లో ట్రీటియం, కార్బన్‌-14 మూలకాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS