Friday, June 6, 2025
spot_img

అక్రమం.. ముడుపులిస్తే.. సక్రమం

Must Read
  • జిహెచ్ఎంసి కమిషనర్, మేయర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా మభ్యపెట్టి మోసం చేశారు..
  • జిహెచ్ఎంసి సర్కిల్ – 3 డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య కనసన్నల్లో అక్రమాలు…
  • ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా భారీ వాణిజ్య నిర్మాణాలు..
  • నిర్మాణ అనుమతులు లేకున్నాసక్రమం చేస్తున్నారు…!
  • జిహెచ్ఎంసి ఖజానాకు చేరవలసిన కోట్ల రూపాయల పన్ను గాయబ్..
  • సొంత జేబుల్లోకి మరలించుకుంటున్న అధికారులు..
  • వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు..
  • చోటా, మోటా నాయకుల సెటిల్మెంట్ల వ్యవహారాలు..
  • ఈ అవినీతి, అక్రమాలపై జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.కరణ్,
    హైడ్రా కమిషనర్ రంగనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి,
    సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి…

నోటీసులివ్వడం.. ఆ తర్వాత చేతులు చాపడం.. అక్రమార్జన లెక్కబెట్టుకోవడం.. నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సక్రమమని తెలుస్తూ హితోధికంగా ఆ నిర్మాణదారులకు సహకరించడం.. ఇదండీ ఇప్పుడు జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ -3 లో జరుగుతున్న తంతు.. ఈ వ్యవహారాలలో డీసీ గా విధులు వెలగబెడుతున్న తిప్పర్తి యాదయ్యది అందెవేసిన చెయ్యిగా కనిపిస్తోంది.. మరి ఇదంతా ఉన్నతాధికారుల దృష్టికి రాలేదా..? వచ్చినా నిమ్మకుండి పోతున్నారా..? ఈ అవినీతి తంతులో వీరికి కూడా వాటాలున్నాయా..? అన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న..

ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ లో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. జి.హెచ్.ఎం.సి ఖజానాకు చేరవలసిన పన్ను కోట్ల రూపాయలు సొంత జేబుల్లోకి మళ్ళించుకుంటున్నా జి.హెచ్.ఎం.సి ఎల్బీనగర్ సర్కిల్ – 3 డి.సి, ఏ.ఎం.సి., మున్సిపల్ అధికారులు.. ఉన్నతాధికారులను మభ్యపెట్టడానికి నోటీసులు.. ఇవ్వడం.. ముడుపులు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం ఇదే తంతుగా మారిపోయింది..

బి.యన్ రెడ్డి నగర్ డివిజన్, సాగర్ కాంప్లెక్స్ , శ్రీనగర్ కాలనీ, రోడ్ నెంబర్ 3, ప్లాట్ నెంబర్ 7, హైవే రోడ్డును అనుకొని భారీ వాణిజ్య భవంతి అంటే అక్రమంగా ఒక హోటల్ నిర్మాణం వేయి గజాల స్థలంలో భారీగా చేపడుతున్నారు.. ఈ నిర్మాణానికి జిహెచ్ఎంసి నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారు.. నిర్మాణం ప్రాథమిక దశలో వ్రాతపూర్వక ఫిర్యాదు చేశారు స్థానిక ప్రజలు.. ఫిర్యాదులపై నామ మాత్రపు నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాన్ని దగ్గరుండి నిర్మింప చేస్తున్నారు ఎల్బీనగర్ సర్కిల్ – 3 డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య., గతంలో ఇదంతా అటవీ భూమని, ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉండి రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు ఇచ్చేవారు కాదు.. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈ విషయంపై గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ పెద్దలను ఆమోదింపజేసి, జీ.వో ఎంఎస్ 118 తీసుకువచ్చారు. స్థానిక ప్రజలు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.. ఇతర పార్టీ నాయకులు జీవో ఎంఎస్ 118 నీరుగార్చే ప్రయత్నంగా స్థానికంగా నివాసం ఏర్పరచుకున్న కొంతమంది ప్రజలు తమ స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోలేదు.

ఈ క్రమంలో ఇక్కడ గృహ నిర్మాణ అనుమతులు కావాలనే తీసుకోరు. రాజకీయ నాయకులు కనుసనల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇదే అదునుగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి ప్రత్యక్షంగా దృష్టి సారించి ఒక్కో నిర్మాణానికి ఐదు లక్షలు, పది లక్షలు రేటు ఫిక్స్ చేసి, నిర్మాణదారుల నుంచి వసూలు చేసి, అంతా మేము చూసుకుంటాం ఏమీ కాదు అని అభయం ఇస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది..? ఉన్నత అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు.? వందల వేల సంఖ్యలో భారీ వాణిజ్య అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా వాటికి నామమాత్రపు టాక్స్ వేసి, అసెస్మెంట్, హౌస్ నెంబర్ అలాట్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య భారీ అవినీతికి పాల్పడుతున్నాడు అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి..

గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి ప్రత్యేకంగా దృష్టిసారించి డిప్యూటీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులను మందలించడంతో భారీ కమర్షియల్ నిర్మాణాలను పదుల సంఖ్యలో గుర్తించి సీజ్ చేశారు.. ఇప్పుడు ఆ నిర్మాణాలు సంపూర్తిగా నిర్మించబడి ఓపెన్ అయి, వాణిజ్య వ్యాపారాలు పూర్తిస్థాయిలో నిర్వహించబడుతున్నాయి.

జిహెచ్ఎంసి సంస్థను మోసం చేసి, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, భారీ ఎత్తున ముడుపులు తీసుకుని సక్రమం చేశారు.. ఈ అవినీతి అక్రమాలపై జి.హెచ్.ఎం.సి., విజిలెన్స్ , హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి కమిషనర్ కరణ్, మున్సిపల్ శాఖ మంత్రి, సీ.ఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఎంక్వయిరీ చేసి, అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనం ప్రార్థిస్తున్నారు..

మరిన్ని ఆధారాలతో రేపటి కథనంలో మీ ముందుకు…” ఆదాబ్ హైదరాబాద్ “.. ” మా అక్షరం అవినీతిపై అస్త్రం “…!

Latest News

గుడ్డులో ఏమేం ఉంటాయి?

గుడ్లు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే.. వీటిలో పోషకాలు సంవృద్ధిగా ఉంటాయి. ఒక గుడ్డులో సుమారు 70 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్, 5...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS