జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కన్నుల పండువగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి మేయర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.













