Sunday, October 19, 2025
spot_img

రెండు ఇన్-బిల్ట్ సబ్ వూఫర్లతో వస్తోన్న మొట్టమొదటి టీవీ

Must Read

జూలై 18, 2025న ఫ్లిప్ కార్ట్ పై ప్రత్యేకంగా విడుదల

భారతదేశంలో స్మార్ట్ లివింగ్ కు మరింతగా తోడ్పాటును అందిస్తూ ఫ్రాన్స్ యొక్క ఐకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం థామ్సన్, ఇప్పుడు గతంలో కంటే పెద్దదిగా, ప్రకాశవంతంగా 65” మరియు 75” లలో తమ అద్భుతమైన కొత్త మినీ ఎల్ఈడి టీవీ సిరీస్‌ను విడుదల చేసింది. భారతదేశం చూసే, ఆడే మరియు వినే విధానాన్ని మార్చడానికి థామ్సన్ సిద్ధంగా ఉంది.

ప్రీమియం మెటాలిక్ బాడీ డిజైన్‌లో తీర్చిదిద్దబడిన ఈ టీవీ, సౌందర్యాన్ని మన్నికతో మిళితం చేసి, ఆధునిక జీవన స్థలం యొక్క శైలిని పెంచుతుంది. ఈ కొత్త మినీ ఎల్ఈడి టీవీలు జూలై 17, 2025 నుండి భారతదేశపు స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ అయిన ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి వరుసగా రూ. 61,999 & రూ. 95,999 ధరలతో అందుబాటులో ఉన్నాయి.

“మేము కేవలం టీవీలను విడుదల చేయటం లేదు. భారతీయ లివింగ్ రూమ్‌ల భవిష్యత్తును కూడా ప్రారంభిస్తున్నాము” అని భారతదేశంలో థామ్సన్ ప్రత్యేక లైసెన్స్ పొందిన ఎస్ పిపిఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా అన్నారు. “మా కొత్త మినీ ఎల్ఈడి శ్రేణి డాల్బీ విజన్, హెచ్ డి ఆర్ 10, హెచ్ ఎల్ జి , రిఫ్రెష్ రేట్ 122 హెర్ట్జ్ , 108 వాట్ల అవుట్‌పుట్‌తో డాల్బీ అట్మాస్-ఆధారిత ఆడియో, 6 స్పీకర్లతో పాటు తాజా 5.0 గూగుల్ టీవీ అనుభవం వంటి ప్రపంచవ్యాప్త డిస్‌ప్లే టెక్నాలజీని సగర్వంగా భారతదేశంలో తయారు చేసింది” అని అన్నారు.

“2018లో థామ్సన్ భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినప్పటి నుండి, ఫ్లిప్‌కార్ట్ మాకు ముఖ్యమైన అమ్మకాల భాగస్వామిగా ఉంది. దానికి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి తిరుగులేని మద్దతు మాకు పది రెట్లు ఎదగడానికి మరియు దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్ టీవీ బ్రాండ్‌లలో ఒకటిగా థామ్సన్‌ను నిలపటానికి సహాయపడింది” అని ఆయన జోడించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This