Monday, July 7, 2025
spot_img

భారతదేశపు అత్యంత సామర్థ్యం గల ఎస్‌యువి సిద్ధం

Must Read
  • టాటా మోటార్స్ కొత్త హారియర్ ఈవీ ప్రారంభం
  • పూణే ప్లాంట్ నుండి మొదటి ఈవీ విడుదల
  • జూలై 2025 డెలవరీలు ప్రారంభం

టాటా మోటార్స్ భారతదేశంలో విద్యుత్ వాహన విప్లవానికి ముందువరుసలో ఉన్న సంస్థ మరియు దేశంలో అతిపెద్ద ఎస్ యు వి తయారీ చేసే సంస్థ. ఈ రోజు దేశపు అత్యంత శక్తివంతమైన, అత్యధిక సామర్థ్యం గల మరియు అత్యంత తెలివైన ఎస్ యు వి అయిన హారియర్.ఈవీ ఉత్పత్తిని ప్రారంభించింది. పుణేలోని టాటా మోటార్స్ ఆధునిక తయారీ కేంద్రంలో హారియర్.ఈవీ ఉత్పత్తి లైన్ పై నుంచి గర్వంగా బయటకు వచ్చిన దృశ్యం అద్భుతంగా ఆకట్టుకుంది. మార్కెట్ నుండి విశేష స్పందనతో బుకింగ్ లకు ఈ కొత్త ఎస్ యు వి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. హారియర్.ఈవీ దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లకు త్వరలో చేరుకోనుంది. వినియోగదారులకు డెలివరీలు జూలై 2025 నుండి ప్రారంభం కానున్నాయి. హారియర్ ఈవీ రెండు డ్రైవ్ ఆకృతుల్లో అందుబాటులో ఉంది. క్వాడ్ వీల్ డ్రైవ్ (క్యూ డబ్ల్యూ డి) మరియు రియర్ వీల్ డ్రైవ్ (ఆర్ డబ్ల్యూ డి). ఈ ఎలక్ట్రిక్ ఎస్ యు వి లు నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభ్యమవుతుంది. నైనితాల్ నాక్టర్న్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టిన్ వైట్, మరియు ప్యూర్ గ్రే. అదేవిధంగా, వినియోగదారుల ప్రశంసలు పొందిన స్టెల్త్ ఎడిషన్‌లో కూడా ఇది లభిస్తుంది. ఇది మెటె ఫినిష్ ఉన్న గాఢ నలుపు మరియు పూర్తి నలుపు ఇంటీరియర్స్‌తో వస్తుంది. మరింత దూకుడైన, శక్తివంతమైన లుక్‌ కోసం రూపొందించబడిన ఈ వేరియంట్‌ ప్రత్యేకంగా మీ ఉనికిని తెలియజేస్తుంది.

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS