- వంధత్వం నేటి జంటలను వేధిస్తున్న మౌన రుగ్మత..
- జంటల్లో పెరుగుతున్న సంతానలేమి..
- నేడు వరల్డ్ ఐవీఎఫ్ డే..
తల్లి తాపత్రయం అనేది మానవ సంబంధాల్లో అత్యంత పవిత్రమైన భావన, పిల్లల కోసం చీకటి దారుల్లోనూ వెలుగు వెలిగించే తల్లి ప్రేమా, ఆందోళన ఇవన్ని కలిసిన రూపమే తల్లి తాపత్రయం.. దానికి ప్రతిఫలం ఎప్పటికి అవసరంలేదు. ఒక్క బిడ్డా నవ్వు చాలు ఆమెకు ప్రంపంచమే లభించినట్లు, కానీ నేడు అమ్మ అనే పిలుపు కోసం అనేక మంది మహిళలు ఎంతోగాను ఎదురు చూస్తున్నారు. ఆధూనిక జీవనశైలి వల్ల సంతానలేమి ‘‘వంధత్వం’’ సమస్యలు పెరిగిపోయి వివాహమై ఏళ్ల గడుస్తున్న సంతానం కలుగక బాధపడుతున్నా వారి సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది. ఈ సమస్యను గుర్తించిన బ్రిటిష్ ఐ.వీ.ఎఫ్ వైద్యురాలు గైనకాలజిస్టు, పాట్రీక్ స్టెఫో, శాస్త్రవేత్త రాబర్డ్ ఎడ్వర్డ్స్ , వీరి పరిశోధనల ఫలితంగా ప్రంపంచలో తొలి ఐవీఏఫ్ బేబి జూలై 25 1978న ఇంగ్లాడ్‌లోని మాంచేస్టర్ ఒల్డోహామ్ జిల్లా ఆసుపత్రిలో తల్లిదండ్రులు లేసి మరియు పీటర్ బ్రౌన్‌లకు ఇన్ విట్రో ఫేర్టిలైజేషన్ ద్వారా ప్రపంచంలోనే మొట్ట మొదటి బిడ్డా లూయిస్ జాయ్ బ్రౌన్ జన్మించాడు. ఆ ఘట్టాన్ని గుర్తిస్తూ.. ప్రతి సంవత్సరం ఇదే తేదిన ఐవీఎఫ్ డే నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఆదాబ్ పాఠాకులకు అందిస్తున్న పరిశీలానాత్మక ప్రత్యేక కథనం…!!
వంధత్వ మౌన రుగ్మత….!!
నేటి ఆధూనిక జీవనశైలిలో దంపతులు ఎదుర్కోంటున్న అత్యంత భావోద్వేగ సమస్యలలో వంధత్వం (ఇన్‌ఫర్టిలిటీ ) ఒకటి. మానసిక ఒత్తిడి హార్మోన్ల ఆసమ తుల్యత, కాలుష్యం తప్పైన ఆహార అలవాట్లు, ఆలస్యమైన వివాహాలు, పుట్టక సమస్యలు, ఇవన్నీ కలిసి సంతానాలేమి సమస్యను ప్రబలంగా మలుస్తున్యాయి. మన భారతదేశంలో ప్రతి ఆరు జంటల్లో ఒక జంట వంధత్య సమస్యను ఎదుర్కొంటున్నట్లు వైద్యపరిశోధనలు చెబుతున్నాయి. కాలక్రమేణ ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగించే విషయం. పురుషుల్లో స్పెర్మ్ ఉత్పత్తి సమస్యలు, మహిళలలో (పీ.సీ.ఓ.ఎస్,) ఎండోమైట్రీయోసిన్ ఫైబ్రాయిడ్స్ వంటి ఆరోగ్య సమస్యలు వంధత్వానాకి ప్రధాన కారణాలు అయి ఉంటాయని వైద్యులు అంటున్నారు.
సంతానలేమికి కారణాలు ఇవే..
మగవాళ్లలో దీర్ఘాకాలిక వ్యాధులైన బిపి, చక్కేర వ్యాధి, స్మోకింగ్, అల్కాహాల్ సేవనం, మత్తు పదార్ధాలు తీసుకోవడం. బీర్జాలకు దెబ్బలు తగలడం, అంగం సైజుల్లో తేడా వంటి వాటివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆడవారిలో పెళ్లైన ఏడాది పాటు ఎలాంటి గర్భనిరోదక పద్దతులు పాటించకుండా దాంపత్య జీవితాన్ని కొనసాగించిన గర్భం రాకపోవటాన్ని వంధత్వం (ఇన్ ఫెర్టీలిటీ ) అంటారు. ఆడవాళ్లలో సంతాన లేమి కారణాలో ఆలస్యంగా అంటే 35ఏళ్ల దాటి పెండ్లి చేసుకోవడం.. సమయానికి రజస్వలం కాకపోవడం.. హార్మోన్ల ఆసమతుల్యం.. కడుపులో ఇన్ ఫెక్షన్లు, గర్భసంచి ట్యూబ్‌లు మూసుకుపోవడం.. పీసీఓడి జునైటేల్ టీబీ, షూగర్, బిపి అధిక మానసిక వత్తిడి అధిక బరువు అండం విడుదల జరిగే సమయంలో దాంపత్యం పాల్గనకపోవడం.. దాంపత్యం కోసం మూఢనమ్మకాలను ఆచరించడం… సెక్స్‌పై అవగాహాన లేకపోవడం ఇలా ఎన్నో కారణాలు లేకపోలేదు.
