మంచు విష్ణు కథ రాసి కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప. రేపటి(జూన్ 25 బుధవారం) నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకానున్న ఈ మూవీ.. శుక్రవారం(జూన్ 27న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సార్ సైతం పూర్తయింది. సెన్సార్ అధికారుల సూచన మేరకు 12 నిమిషాల నిడివి గల సీన్లను తొలగించారు. దీంతో టోటల్ రన్టైమ్ 3 గంటల 2 నిమిషాలుగా తేలింది. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా స్టోరీ రాసుకున్న ఈ చిత్రంలో తిన్నడు లేదా కన్నప్పగా విష్ణు నటించాడు. ప్రభాస్.. రుద్ర పాత్రలో మెరిపించనున్నాడు. శివుడిగా అక్షయ్ కుమార్,పార్వతిగా కాజల్ అగర్వాల్, కిరాతగా మోహన్ లాల్, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నటించారు