Friday, August 15, 2025
spot_img

భూకబ్జాల దందా.. బీజేపీ నేతల అండ..

Must Read

జవహర్ నగర్ లో ప్రభుత్వ స్థలలు కాబ్జా

కబ్జా చేసి అమ్మిన స్థలాలు కొని మోసపోయిన పేద ప్రజలు

ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలు అంటు పత్రికలో వార్తలు

నేలమట్టం చేసిన కాప్రా తహసీల్దార్ విమర్శలు చేసిన బిజెపి నేతలు

ప్రభుత్వ భూములు పట్టా స్థలం అన్నట్టు నోటరీ డాక్యుమెంట్ ద్వారా ఎనిమిది లక్షల నుండి మొదలు పెడితే 15 లక్షల వరకు అమ్మేస్తూ అమాయక ప్రజలకు కుచ్చు టోపీ పెడుతున్న జవహర్ నగర్ రియాల్టర్ లపై ప్రత్యేక కథనం..

మేడ్చల్ జిల్లా ప్రతినిధి ఆదాబ్ హైదరాబాద్ / అవి ప్రభుత్వ భూములు అయినా సరే డోంట్ కేర్ మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రి ఉన్నాడు ఏకంగా ప్రభుత్వమే మాది కబ్జా చేస్తాం ఇల్లు కడతాం షెడ్డులు కడుతాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ జోహార్ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేస్తున్న రియల్ మాఫియా..

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అంటూ మీడియా ఛానల్స్ డైలీ తెలుగు దినపత్రికలు ప్రచురణ చేస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన కాప్రా తహసిల్దార్ సుచరిత..

భూకబ్జాదారులకు బిజెపి నేతల అండ / పేదోడికి భూముల అమ్మిన భూకబ్జదారుడుపై విమర్శలు చేయాల్సిన బీజేపీ నేతలు రెవెన్యూ అధికారైన తహసిల్దార్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతే ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులే పాలకులకు అండగా నిలిచి భారతీయ జనతా పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారంటూ జోహార్ నగర్ ప్రజలు అంటున్నారు…

కాప్రా తహసిల్దార్ సుచరిత /
రెవెన్యూ అధికారిగా నా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే విధులకు ఆటంకం కలిగించే విధంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్ i వారు రెవెన్యూ అధికారుల పేరు చెప్పుకుంటూ వసుల్లకు పాల్పడం తీరా తహసిల్దార్ తెలిసి కూల్చివేసిన తర్వాత రెవెన్యూ అధికారులపై యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేస్తున్న వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.. అంటు జోహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాప్రా తహసిల్దార్ సుచరిత.
ప్రభుత్వ భూములు కాబ్జా అవుతుందని ఫిర్యాదు చేసేది వారే కూల్చిన తర్వాత విమర్శలు చేసేది వారి అంటే పేదోడిని భయపెట్టేందుకు రెవెన్యూ విభాగాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అంటూ తహసిల్దార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

Latest News

జెండా పండుగ అంటే…

అది ఒకవస్త్రాన్నికో, ఒక వర్ణానికో, ఒక వర్గానికో సంబంధించిన వేదిక కాదు..భరత జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పే మహోన్నత వేడుక..!సామాజిక మాధ్యమాల్లోనో, బడుల్లోనో ఒకనాడు కనిపించే...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS