Thursday, August 14, 2025
spot_img

అవయవ దానంతో ఆయువు పోద్దాం..

Must Read
  • ఒకరి మరణం.. మరోకరికి జీవన దానం..
  • అవసరాలు ఎక్కువ.. అవయదానాలు తక్కువ..

  • నా శ్వాస ఆగిపోయిన తర్వాత నా గుండె ఇంకొకరిలో కొట్టుకుంటే ఆది మరణం కాదు సార్‌… అది నా జీవితానికి ఇంకో అర్థం. ఇది ధైర్యం కాదుసార్‌ ఇది మానవత్వం.. – ఒక సినీహిరో డైలాగ్‌..

మనిషి బతికున్నప్పుడే కాదు, చనిపోతు నలుగురికి ప్రాణంపోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. వైద్య పరిజ్ఞానం ఎంతంగా అభివృద్ధి చెందినా కొన్ని సందర్భాల్లో కొత్త అవయవం లేకపోతే చికిత్స అసాధ్యం గుండె, కాలేయం. కిడ్ని, ఉపిరితిత్తులు, కర్ణమూలాలు, కంటిపుటములు, వంటి అవయవాలను దానం చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడొచ్చు. కానీ ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల చాల మంది విగజీవులుగా మారిపోతున్నారు. అవయవ దానం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుదని ప్రజల్లో అపోహా ఉంది. వీటితోపాటు బ్రెయిన్‌ డెడ్‌ ఆయిన వ్యక్తుల ఆవయవ దానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులకు అవగాహాన కల్పించిన వారు అంతగా అంగికరించడంలేదు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం ఆదాబ్‌ పాఠకుల కోసం…

అరంభం అవయవ దానం..
ప్రపంచంలోనే మొట్టమొదటి ఆవయవదానం 1954లో అమెరికాలోని బోస్టన్‌లోని పీటర్‌ బెంట్‌ బ్రీగమ్‌ ఆసుపత్రిలో జరిగింది. రోనాల్డ్‌ లీ హెర్రిక్‌ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్‌ జే హెర్రీక్‌ కి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుండగా లీ హెర్రిక్‌ తన కిడ్ని దానం చేశాడు. దీంతో శస్త్ర చికిత్స సక్సెస్ అయ్యింది. కిడ్నిమార్పు తరువాత జే హెర్రిక్‌ 8సంవత్సరాలు పాటు జీవించాడు. ఇక కిడ్ని దానం చేసిన లీ హెర్రీక్‌ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010 చనిపోయాడు. దీంతో ఆ శస్త్ర చికిత్స చేసిన వైద్యుడికి నోబెల్‌ బహుమతి వరించింది. భారతదేశంలో 1994లోమానవ అవయవాల కణజాల మార్పిడి చట్టం తెచ్చారు. 2011లో దానిని సవరణ చేశారు. దీనిని జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ ఎన్‌ ఓటీటీ ఓ పర్యవేక్షీస్తుంది.

చట్టం సవరణ..
మన దేశంలో రాష్ట్రంలో 1994 నాటి అవయవ మార్పిడి చట్టం టీహెచ్‌ఓఏ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యుమన్‌ ఆర్గన్స్‌ యాక్ట్‌ ) మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి అమలు చేస్తోంది. అయితే ఆ చట్టాన్ని సరవణ చేయాలనే దృక్ఫథంలో కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన టీహెచ్‌ఓటీఏ తోటా, చట్టాన్ని అమలులోకి తేవాలని మన తెలుగు రాష్ట్రంలో శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టి అమెదించింది. దీంతో రాష్ట్రంలో పారదర్శంగా మానవ అవయవ వ్యాపారాన్ని నిరోధించి అవసరమైన వారికి చట్టబంధంగా అధిక సంఖ్యలో అవయవ మార్పిడి జరిగేందుకు అవకాశం కల్పిచింది. వీటితోపాటు 1995 నాటి నిబంధనల ప్రకారం బ్రెయిన్‌డెడ్‌ డిక్లేర్‌ చేసే అధికారం న్యూరోసర్జన్లకు, న్యూరో ఫిజీషియన్లకు మాత్రమే ఉండేంది. నూతన నిబంధనల ప్రకారం ఫిజిషియన్‌ సర్జన్‌, ఇంటెన్సివిస్ట్‌ ఆనస్ధీషియన్‌ కూడా బ్రెయిన్‌ డెడ్‌ డిక్లేర్‌ చేయడానికి అర్హులు. కొత్త నిబంధనల ప్రకారం అవయవ మార్పిడి అక్రమ రవాణ చేసే నిందితులకు ఒక కోటిరూపాయల జరిమాన, 10సంవత్సరాల‌ జైలు శిక్ష కుడా పడే అవకాశం ఉంది.

అవయవం తీసే విధానం..
జీవన్మత్తుల్లో బ్రెయిన్‌ డెత్‌ను ధ్రువీకరించిన వెంటనే కుటుంబ సభ్యుల అమోదంతో అవయవాలను తీయాల్సి ఉంటుంది. ఒక వేళా ఆవయవాలను తీయటం ఆలస్యమైతే కృతిమ శ్వాస కల్పిస్తారు. అవయవాల కణజాల తడారకుండా వాటిపై ద్ర‌వాలు చల్లుతారు. అవయవాలను సేకరించిన వేంటనే 4డిగ్రీలసెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత లో భద్రపరిచి కొద్ది గంటల్లోనే కోల్డ్‌ ఇస్కీమిక్‌టైమ్‌ లోపు మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ సగటు సమయం ఆయా అవయాలను బట్టి మారుతుంది. ఉదహారణకు గుండెను 4.6 గంటలోపు కాలేయం క్లోమం, 12గంటల్లోపు కిడ్ని 24గంటలోపు మార్పిడి చేయవచ్చునని డాక్టర్లు పేర్కొంటున్నారు..

ఆధునిక వైద్య శాస్త్రం అద్భుత విజయం..
ఆధునిక వైద్య శాస్త్రం సాధించిన అద్భుతమైన‌ మైలురాయి అవయవ మార్పిడి పద్దతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయలోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి వారికి స్వస్థత కలిగించే విధానం నానాటికి మెరుగుపడుతుంది. దీనికి చక్కటి నిదర్శనం.. కార్నియ, కణజాలం సేకరించి వాటిని అంధులకు అమర్చితే చూపు తెప్పించడానికి వీలవుతుంది. చర్మం… కాలిన గాయలు, చర్మం, దెబ్బతిన్న వారికి చర్మకణజాల మార్పిడి చికిత్స ద్వారా చర్మాన్ని తిరిగి పొందవచ్చును. కాలేయం (లివర్) మనవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. శరీరంలోని వ్యర్థాలను తోలగిస్తుంది. హైపాటటీస్‌ బి. కారణంగా లివర్‌ పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో లివర్ మార్పిడి అవసరం. జీవించే వ్యక్తులనుంచి లివర్‌ ముక్క సేకరించి వాటిని రోగికి శస్త్రచికిత్స ద్వారా అతికిస్తారు. గుండె కణజాలు, గుండె మార్పిడి అవసరంలేని వారికి గుండె కణజలాన్ని ఉపయోగించి చికిత్స చేస్తారు. ఎముకల కణజాలం… ఒక వ్యక్తి ఎముకల నుంచి సేకరించిన కణజలాన్ని గరిష్టంగా 10మంది రోగులకు పునర్జీవం కల్గించడానికి అవకాశం ఉంది.

జీవన్‌దాన్‌ ద్వారా పునర్జన్మ..
రాష్ట్ర ప్రభుత్వం జీవన్‌దాన్‌ కార్యక్రమం ద్వారా అధికారికంగా ఆర్గాన్‌ మార్పిడి ప్రక్రియను నిర్వహిస్తోంది. మన హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో సెంటర్‌ను 2013లో ప్రారంభించారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం అవసరమైన వారికి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం. అదికూడా కేంద్ర ప్రభుత్వ నియమనిబంధనాల ప్రకారం. కిడ్ని, గుండె ఉపిరితిత్తులు, కాలేయం, గుండె నాళాలు, కంటి కార్ణీయ, క్లోమం, ప్యాంక్రియస్‌ వంటి అవయవాలను మారుస్తు, రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాధిస్తున్నారు. 2013 నుంచి 2025ఆగస్టు నెల వరకు దాదాపు 1,678 మంది అవయవదానం చేశారు. అందులో కిడ్నిలు-2,524, కాలేయం – 1539, గుండె – 227. కార్‌నెస్‌-1459, హార్ట్‌వ్యాలూ – 170, లంగ్స్ – 398, ప్యాంక్రీయస్‌, క్లోమం – 14, మొత్తం 6331 మందికి వివిధ అవయల మార్పిడి శస్త్రచికిత్సల ద్వారా పునర్జన్మ కల్పించారు. ఒకచోట నుంచి మరోచోటికి అవయవాల తరలింపు సమయంలో దారిపోడవున నగర పోలీసులు గ్రీన్‌చానేల్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి సాఫిగా అంబులెన్స్‌కు దారి ఇస్తు తమ కర్తవ్యం నేరవెర్చడమే, కాకుండా 12మంది పోలీసులు ఉద్యోగులు ఏం.శ్రీకాంత్‌, ఎన్‌.వీరబాబు, బి.యాదయ్య, జ్ఞానేశ్వర్‌ రావు, శేఖ్‌బాషా, కోమ్ము సుభాష్ చందర్‌, వి.లింగయ్య, ఎస్‌.లక్ష్మారెడ్డి, మెకల శ్వాంసుందర్‌, బిక్షం నందిపాటి, గంగాధరా అంజయ్య తదితరుల ఆవయదానం చేసిన వారిలో ఉన్నారు. అయితే నేటికి అవయవదానం కోసం అసుపత్రుల్లో అధికంగానే దరాఖస్తులు వస్తున్న, ప్రజలు మాత్రం ఆవయవ దానంపై ఇష్ట పడకపోవడం విచారకరం.

డాక్టర్‌ డి. శ్రీ భూషన్‌ రాజు.. జీవన్‌దాన్‌ ప్రోగ్రాం నోడల్‌ ఆఫీసర్‌..
అవయవ దానం రెండు రకాలుగా చేయవచ్చు. 1, సజీవ (లైవ్‌) బ్ర‌తికున్నావారు అవయవదానం చేయవచ్చు. కిడ్ని, కాలేయం, రక్తదానం.. 2. జీవనస్మతి (కెడావర్‌) దానం అంటే మరణించిన తర్వాత అవయవాలను దానం చేయవచ్చును. ఒక వ్యక్తినుంచి ఎనిమిది రకాల అవయవాలు ఇతరులకు దానం చేసే వీలుంది గుండె, మూత్రపిండాలు, పాంక్రియస్‌, ఉపిరితిత్తులు, కాలేయం, చర్యపుటీష్యూ, కళ్లని, ఎముకల్లోని మజ్జ, జీవన్‌దాన్‌ ట్రస్టు ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు పునర్జన్మ కల్పిస్తున్నారు. బ్రెయిన్‌డెడ్‌ కేసులను గుర్తించి కుటుంబ సభ్యులకు అవయవ దానంపై చైతన్య పరుస్తున్నాం. అవయవాలను దానం చేయాలనుకున్నవారు జాతీయ స్థాయిలో నేషనల్ ఆర్గాన్‌ ఆండ్‌ టీష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆసోసియేషన్‌ (ఎన్‌.ఓ.టీ.టీ.ఓ) ప్రాంతీయ స్థాయిలో జీవన్‌దాన్‌ కార్యక్రమంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చును. ప్రతి డోనర్‌కు ప్రత్యేక మైన నంబర్‌తో కూడిన డోనర్‌ కార్డు జారీ అవుతుంది. ఆగస్టు వరకు దాదాపు 1678 మంది నుంచి అవయవాలు సేకరించి 6,331మంది కి శస్త్రచికిత్సలు చేసాం. 2024 ఏడాదిలో దేశంలోనే అత్యధిక ఆర్గన్‌డోనేట్‌. శస్త్ర చికిత్సలు చేసి నందుకు కేంద్ర మంత్రి జే.పి.నడ్డా చేతులమీదుగా ఆవార్డును అందుకోవడం జరిగింది.

Latest News

AI – పోలీసు విధుల్లో నూతన సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక శిక్షణ

మేడ్చల్, 13 ఆగస్టు 2025:మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS