Monday, August 4, 2025
spot_img

మారుతి అకాడమి లోగో ఆవిష్కరణ

Must Read

విద్యతోపాటు టెక్నాలజీకి ప్రాధాన్యత – మారుతి అకాడమి ప్రత్యేకత

ప్రవాస భారతీయుల పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక సాంకేతిక శిక్షణను అందించేందుకు మారుతి అకాడమి స్థాపించబడిందని, ఇది అభినందనీయమని విబిజి ఫౌండర్ చైర్మన్ టి.ఎస్.వి ప్రసాద్, ఫౌండర్ మడిపడిగె రాజు తెలిపారు. ఆదివారం జరిగిన విబిజి బిజినెస్ సమావేశంలో మారుతి అకాడమి లోగోను వారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా విద్యా రంగంలో పోటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. విద్యార్థులకు పాఠశాల స్థాయిలోనే అత్యుత్తమ శిక్షణ అవసరం. విజయం సాధించాలంటే కేవలం పుస్తక విద్య సరిపోదు. విద్యతోపాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు తప్పనిసరి. ఇవి రెండింటినీ సమన్వయపరిచే విద్యా వేదికగా మారుతి అకాడమి చక్కటి పాత్ర పోషించనుంద‌ని వ్యాఖ్యానించారు.

మారుతి అకాడమి మేనేజింగ్ డైరెక్టర్ మారుతి గుప్తా మాట్లాడుతూ.. గత 23 ఏళ్లుగా 46,000 మందికి పైగా విద్యార్థులకు మారుతి టెక్నాలజీస్ ద్వారా వివిధ కంప్యూటర్ కోర్సులలో శిక్షణ అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం విదేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయుల పిల్లలకు పాఠశాల విద్య సరిపోవడం లేదని, వారిని పోటీ ప్రపంచానికి సిద్ధం చేసేందుకు సరైన దిశానిర్దేశం, నిపుణుల బోధన అవసరమని పేర్కొన్నారు.

ఈ అవసరాన్ని తీర్చేందుకు ఆన్‌లైన్ ఆధారిత శిక్షణను ప్రవాస భారతీయుల పిల్లలకు అందించాలన్న సంకల్పంతో మారుతి అకాడమిని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, పర్సనలైజ్డ్ ట్యూటరింగ్, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక విద్యా విధానాలను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని మెరుగుపరుచుకుని బలమైన భవిష్యత్తు నిర్మించుకునేందుకు ఇది గొప్ప వేదికగా మారుతుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 9966061444 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విబిజి కో ఫౌండర్స్ వెంకటేష్, సతీష్, జగదీష్, శ్రీనివాస రావు , గ్లోబల్ టీం సతీష్, సంతోష్, సుమన్, హెడ్ టేబుల్, కోర్ కమిటీ, సభ్యులు పాల్గొన్నారు.

Latest News

ఖాజాగూడలో పిడుగు ప్రమాదం

భయాందోళనలో స్థానిక ప్ర‌జ‌లు నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్‌లోని హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS