Saturday, August 2, 2025
spot_img

లోక్‌సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌

Must Read
  • బిజెపికి అనుకూలంగా ఎన్నికల సంఘం పనితీరు
  • దాని ఆధారాలు తమవద్ద ఉన్నాయి
  • తాము అధికారంలోకి వచ్చాక దేనినీ వదలం
  • అధికారులు రిటైర్‌ అయినా పట్టుకుని శిక్షిస్తాం
  • కాంగ్రెస్‌ న్యాయసమీక్ష సదస్సులో రాహుల్‌

మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వార్షిక న్యాయ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. భారత దేశంలో ఎన్నికల సంఘం న్యాయ సమ్మతంగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలను రిగ్గింగ్‌ చేయవద్దు అని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని రాహుల్‌ తెలిపారు. ఆ రిగ్గింగ్‌కు చెందిన డేటా, డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయన్నారు. దీన్ని మేం నిరూపిస్తామని, ఆ డేటా ఇప్పుడు ఉందని రాహుల్‌ పేర్కొన్నారు. ఓ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన అధ్యయనాన్ని ఆయన వెల్లడించారు. ఆ నియోజకవర్గంలో ఉన్న 6.5 లక్షల ఓటర్లలో 1.5 లక్షల ఓట్లు నకిలీ అని పేర్కొన్నారు. అలా ఫ్రాడ్‌ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, 15 లేదా 20 సీట్లు తగ్గి ఉంటే, అప్పుడు మోదీ ప్రధాని అయ్యేవారు కాదని రాహుల్‌ అన్నారు. ఇండియాలో ఎన్నికల సంఘం చచ్చిపోయిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు గెలవలేదని, నాకు ఆశ్చర్యం వేసిందని, ఎప్పుడైనా ఎన్నికల అవకతవకల గురించి మాట్లాడితే ఆధారాలు అడుగుతున్నారని రాహుల్‌ అన్నారు.

అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ మార్పు కనిపించిందని, లోక్‌సభకు.. విధానసభకు ఎన్నికల జరిగిన సమయంలో కొత్తగా కోటి ఓటర్లు జత కలిశారని, దాంట్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి వెళ్లాయని, అందుకే తన వద్ద ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నాని రాహుల్‌ పేర్కొన్నారు.ఈ క్రమంలో మరోమారు భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ రాహుల్‌ గాంధీమరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందని అన్నారు. ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా తక్కువ మెజారిటీతో మూడోసారి ప్రధానిగా గెలుపొందారని అన్నారు. భాజపాకు ప్రయోజనం చేకూర్చడానికి ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనంలో పాలుపంచుకుందని ఆరోపించారు. 2014 నుంచి ఏదో తప్పు జరుగుతోందని తనకు అనిపిస్తోందని.. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పైనా అనుమానాలు ఉన్నాయని రాహుల్‌ అన్నారు.

ఎన్నికల దుర్వినియోగానికి సంబంధించిన అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని.. లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌ ఎలా జరిగిందనే విషయాన్ని త్వరలోనే తాము ప్రజల ముందు నిరూపిస్తామని పేర్కొన్నారు. తాము బయటపెట్టే నిజంతో ఈసీ పునాదులు కదిలిపోతాయన్నారు. ఓట్ల కుంభకోణంలో పాల్గొన్న ఎన్నికల కమిషన్‌ అధికారులు పదవీవిరమణ చేసినా కూడా వారిని వదలమని హెచ్చరించారు. భాజపా కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించిన ఆయన.. దాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని అన్నారు. కాగా ఈ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండిరచింది. అవన్నీ నిరాధార ఆరోపణలేనని.. రాహుల్‌ లాంటి వారు చేస్తోన్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదని తెలిపింది.

Latest News

పుచ్చపండు.. పోషకాలు మెండు

పుచ్చకాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? దానికి కూడా దినోత్సవం అవసరమా? ప్రతీ దానికి ఓ రోజు కేటాయించడం కామనైపోయింది. అని మనకు అనిపించడం సహజం. ఐతే.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS