Tuesday, August 5, 2025
spot_img

మెగా జాబ్, స్కిల్, లోన్ మేళా ప్రారంభం

Must Read

తెలంగాణ రాష్ట్రాన్ని “స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్”గా అభివృద్ధిచేయాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. యువతకు శిక్షణ ఇచ్చేందుకు కొత్త కోర్సులను రూపొందిస్తున్నామని తెలిపారు. యువతీయువకులు తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుచేశామని శ్రీధర్‌బాబు వెల్లడించారు.

బషీర్‌బాగ్‌లోని ఉస్మానియా పీజీ లా కాలేజీలో నిర్వహించిన “మెగా జాబ్, స్కిల్, లోన్ మేళా” ప్రారంభోత్సవంలో శ్రీధర్‌బాబు, జయంత్‌ చౌదరి పాల్గొన్నారు. శ్రీధర్‌బాబు వినతిపై జయంత్ చౌదరి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. యువతలో నైపుణ్యం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తుందని జయంత్ చౌదరి పేర్కొన్నారు.

Latest News

ఖాజాగూడలో పిడుగు ప్రమాదం

భయాందోళనలో స్థానిక ప్ర‌జ‌లు నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్‌లోని హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS