ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్ లో జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందికి ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు.












