- మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పై అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
- కాలేశ్వరం కట్టిన కేసీఆర్ ఒక ఇంజనీరు
- సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిన జగదీష్ రెడ్డి మరొక ఇంజనీరు
- మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి
పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి పై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అప్పుల ఊబిలో నెట్టివేసిన ఘనత కేసిఆర్ కు దక్కిందని ఆక్షేపించారు. ప్రజా పాలన చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఉత్తమ్ పై వ్యక్తిగత అసభ్యకరమైన విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజాసేవకే తమ జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. స్థాయిని దిగజారే మాటలు మాట్లాడవద్దని ధ్వజమెత్తారు. ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్రపతి కార్యాలయంలో పనిచేసిన వ్యక్తి అని, పలు యుద్ధ విమానాలు నడిపిన వ్యక్తిగా నల్లగొండ జిల్లా వాసిగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో 1994 సంవత్సరంలో రాజకీయ అరంగ్రేటం చేశారని, ఆ సంవత్సరంలో ఉత్తంకుమార్ రెడ్డి స్వల్ప ఓటమి చెందారని, నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా ఓటమి ఎరగలేదని ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం పార్లమెంట్ సభ్యునిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పై బురద చల్లడం ఏమాత్రం సముచితం కాదని, వ్యవసాయ రంగంలో పంజాబ్ రాష్ట్రాన్ని అధిగమించామని పేదవాడు సన్న బియ్యం తినాలనే సంకల్పంతో అమలు చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. మరలా వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకొని నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఉత్తంకుమార్ రెడ్డి పైచేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షల కోట్లు దుర్వినియోగం చేశారని, మంత్రిగా జగదీశ్ రెడ్డి హయాంలో సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. నీ స్థాయికి మేమే ఎక్కువ, మీకు దమ్ము దైర్యం ఉంటే రాజీనామా చేసి, ప్రజా క్షేత్రంలోకి రా తేల్చుకుందాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కోట్ల రూపాయల ఖర్చుపెట్టి గెలిచినవ్. మరోసారి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మీద ఎలాంటి అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగడుగున నిరసనలతో అడ్డుకుంటామని హెచ్చరించారు. వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ దరావత్ వీరన్న నాయక్, పార్టీ నాయకులు చింతమల్ల రమేష్, ఆలేటి మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.