- 215 మంది అభ్యర్డులు హాజరు
- జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు
నీట్ పిజి పరీక్ష సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తెలిపారు. ఆదివారం ఎస్ వి ఇంజనీరింగ్ కాలేజీ నందు జరుగుతున్న నీట్ పిజి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ నందు 179 అభ్యర్థులకు గాను 171 మంది హాజరైనారని 08 మంది గైర్హాజరు అయినారని అలాగే కోదాడ సన ఇంజనీరింగ్ కాలేజీ నందు 50 మందికి గాను 44 హాజరైనారని, 6మంది గైర్హాజరు అయ్యారని అదనపు కలెక్టర్ తెలిపారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ జయలత, తహసీల్దార్ కృష్ణయ్య,అధికారులు, సిబ్బంది అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.