Tuesday, June 24, 2025
spot_img

పది నెలలుగా ఉద్యోగం నిల్.. జీతం ఫుల్!

Must Read

పది నెలలుగా అందుబాటులో లేని ఫైర్ స్టేషన్ ఆఫీసర్
మిర్యాలగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తున్న వైనం
డ్యూటీకి డుమ్మా కొట్టిన దేవరకొండ ఫైర్ ఆఫీసర్:
దేవరకొండ అగ్నిమాపక కేంద్రంలో అధికారి ఉన్నారా

అగ్నిమాపక కేంద్రం కార్యాలయంలో అంతులేని అవినీతికి అండగా నిలుస్తున్న ఉన్నత అధికారులు

దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అగ్నిమాపక కేంద్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ గత పది నెలలుగా విధులకు డుమ్మా కొడుతూ,కనీసం కార్యాలయం వైపు కూడా కన్నెత్తి చూడకుండా పూర్తి జీతం డ్రా చేసుకుంటున్నారని వెల్లడైంది.ఈ వ్యవహారం దేవరకొండ ప్రజలనే కాకుండా,ఉన్నతాధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పది రోజులకొకసారి వచ్చి పది రోజుల సంతకాలు… జీతం డ్రా!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, దేవరకొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నెలకు కేవలం పది రోజులకొకసారి వచ్చి,గత పది రోజుల సంతకాలను ఒకేసారి వేసి జీతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పది నెలలుగా ఈ పద్ధతి కొనసాగుతున్నా, ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.అందుబాటులో లేని అధికారి.మిర్యాలగూడ ఎస్.హెచ్.ఓ చేతుల్లో దేవరకొండ ఫైర్ స్టేషన్!
దేవరకొండ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అందుబాటులో లేకపోవడంతో, మిర్యాలగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్.హెచ్.ఓ దేవరకొండ అగ్నిమాపక కేంద్రం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇది ఒకే అధికారి రెండు వేర్వేరు స్టేషన్ల బాధ్యతలు నిర్వహించడం వల్ల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫైర్ స్టేషన్ అధికారి లేకుండా ఎలా పనిచేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.అంతులేని అవినీతికి అండగా నిలుస్తున్న ఉన్నత అధికారులు?

పది నెలలుగా ఒక అధికారి విధులకు హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్నా, సంబంధిత ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉండవచ్చని ప్రజలు అనుమానిస్తున్నారు. ఈ అక్రమానికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అగ్నిమాపక కేంద్రం వంటి కీలక విభాగంలో ఇలాంటి నిర్లక్ష్యం ప్రమాదకరమైన పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి,విధులకు డుమ్మా కొట్టిన అధికారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ అవినీతి వెనుక ఉన్న వారిని బయటపెట్టి కఠినంగా శిక్షించాలని దేవరకొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన అగ్నిమాపక శాఖలో పారదర్శకత లేమిని, జవాబుదారీతనం లేకపోవడాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

Latest News

ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ (జూన్ 24 మంగళవారం) సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS