Sunday, June 8, 2025
spot_img

న్యూజిలాండ్‌లో ఎన్టీఆర్ సినీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్

Must Read

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ఎన్‌టీ రామారావు సినీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ (వజ్రోత్సవాలు) ఘనంగా జరిగాయి. ఈ 60 ఏళ్ల వేడుకలను ఆక్లాండ్‌లోని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం, ఆక్లాండ్ తెలుగు అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించాయి. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్, గ్లోబల్ నెట్‌వర్క్ చైర్మన్ టీడీ జనార్ధన్, వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి, పెనమలూరు శాసన సభ్యుడు బోడె ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఒక బుక్.. తారకరామం. రెండో బుక్.. స్వర్ణాంధ్ర సారథి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు. ఎన్టీఆర్ సినీ కథానాయకుడిగానే కాక సమాజ సేవకుడిగా నిర్వహించిన కార్యక్రమాలను నందమూరి రామకృష్ణ వివరించారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానాలను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో పుస్తకాలను ప్రచురించినట్లు టీడీ జనార్ధన్ వెల్లడించారు. త్వరలోనే ‘అన్న ఎన్టీఆర్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తామని, ఎన్టీఆర్‌తో అనుబంధం కలిగినవారి ఇంటర్వ్యూలను అందులో ప్రసారం చేస్తామని తెలిపారు.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS