ఎప్పుడూ నిత్య విద్యార్థిలా ఉండు. ఈ సమాజం ముందు.. ఏమీ తెలియని అజ్ఞానిలా కనపడు. ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నా బికారిలా బతుకు. నీకు ఎంత ప్రతిభ ఉన్నా నువ్వు చేసే పని దగ్గర ఆ తెలివితేటలను ప్రదర్శించొద్దు. ఏమీ ఎరగనివాడిలా పనిచెయ్యాలి. ఎందుకంటే ఈ సొసైటీలో సాటి మనుషుల మీద ఈర్ష్య, అసూయ పెరిగిపోతున్నాయి. ఎదుటి వ్యక్తులు ఎదిగితే, బాగుపడితే, మంచిగా బతికితే చూసి తట్టుకోలేకపోతున్నారు.