Thursday, August 7, 2025
spot_img

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో అత్భుత ప్రతిభ

Must Read
  • మెడిసిటీ కళాశాల ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు…
  • విద్యార్థులను అభినందించిన కళాశాల యాజమాన్యం..
  • విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి – ప్రొఫెసర్ శివరామకృష్ణ

ఈ నెల 2 న సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీ బాల్ పోటీలలో మేడ్చల్ జిల్లా లోని మెడిసిటి కళాశాల ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు అత్భుత ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించారు. తెలంగాణ నర్సింగ్ అసోసియేషన్ ప్రతి ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి వాలీ బాల్ పోటీలలో మహమ్మద్ కైఫ్ నాయకత్వంలో మెడిసిటి కళాశాల ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు ట్రోఫీ సాధించారు. ఈ నెల 2 న సంగారెడ్డిలోని యం యన్ ఆర్ మెడికల్ కళాశాల ఆవరణలో జరిగిన ఫైనల్స్ లో విజయం సాధించి మెడిసిటీ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్. విద్యలత చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ శివరామకృష్ణ డైరెక్టర్ డా. సి మల్లికార్జున రెడ్డి, మెడిసిటీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. హైమావతి, శ్రీరాముల కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, కోచ్ జి శివారెడ్డి లు అభినందించారు.

ఈ సందర్బంగా ప్రొఫసర్ శివరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువులలోనే కాకుండా తమకు ఇష్టమైన వాటిల్లో కూడా ప్రతిభ కనపరచడానికి ముందంజలో ఉండాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వమే కాకుండా మంచి నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్రొఫెసర్ శివరామకృష్ణ, ప్రెసిడెంట్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ – డా. సి మల్లికార్జున రెడ్డి, డైరెక్టర్ అకడమిక్స్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ – డా. హైమావతి శ్రీరాముల, ప్రిన్సిపాల్ ,మెడిసిటీ నర్సింగ్ కళాశాల – జి శివారెడ్డి, కోచ్, కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తో పాటూ మహమ్మద్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

నేరాల ఛేదనకు కృత్రిమ మేధస్సు.. పోలీసులకు డిజిటల్ శిక్షణ

నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS