Thursday, July 3, 2025
spot_img

పోగొట్టుకున్న ఫోన్ లు రికవరీ

Must Read
  • 112 ఫోన్ లు బాధితులకు అందించిన పోలీసులు
  • జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

పోగొట్టుకున్న సుమారు 25 లక్షల రూపాయల విలువ గల 112 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి రూరల్ సీఐ రాజశేఖర్ వారికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితులకు) అందజేశామని, ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నాం అన్నారు.ఫోన్ రికవరీ చేయడం కోసం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారు. జిల్లాలో ఈ సంవత్సరంలో 1130 మొబైల్స్ పోయినట్లు సి ఈ ఐ ఆర్ పోర్టల్ నందు పిర్యాధులు వచ్చాయని, వీటిల్లో 510 ఫోన్లను రికవరీ చేసి బాధితులకి అందజేయడం జరిగిందన్నారు. మొబైల్ ఫోన్ పోయిన, చోరికి గురైనా (www.ceir.gov.in) అప్లికేషన్ నంధు నమోదు చేసుకోవాలని సూచించారు. మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు. మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుందని, మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. మొబైల్ ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. బాధితులు జిల్లా పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐ‌టి కోర్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు.

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS