Thursday, August 7, 2025
spot_img

‘ప్రేమలో రెండోసారి’ లిరికల్ వీడియో విడుదల

Must Read

సాకే రామయ్య సమర్పణలో సిద్ద క్రియేషన్ బ్యానర్ లో సత్య మార్క దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్ ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత వేణుగోపాలస్వామి. చార్టెడ్ అకౌంటెంట్ చేతుల మీదుగా ‘ప్రేమలో రెండోసారి’ లిరికల్ వీడియో విడుదల చేయడం జరిగినది. ఈ సందర్బంగా వేణుగోపాల స్వామి గారు మాట్లాడుతూ ‘ప్రేమలో రెండోసారి’ చిత్ర టైటిల్ చాలా బాగుంది. ఈ జనరేషన్ యువతకు ఈ సినిమా ఎంతో నచ్చుతుందని, ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి ప్రేమకు దూరమైనప్పుడు ఏదో ఒక సందర్భంలో మరోసారి ప్రేమలో పడడం సహజం కాబట్టి తెలుగు ప్రేక్షకులకు నీ అలరిస్తుందని అన్నారు. సాంగ్స్ చాలా మెలోడీగా ట్రెండింగ్ గా ఉన్నాయని, కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని, మ్యూజిక్ డైరెక్టర్ రమణ సాకే ని అభినందించారు. ఈ సాంగ్ లోనే సినిమా ప్రతిభ, టీం యొక్క కృషి ఎంతగానో తెలుస్తుందని, టీం అందరికి అల్ ది బెస్ట్ చెబుతూ వారిని అభినందించారు. ఈ సినిమా చక్కటి ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకం నాకుంది అన్నారు. హీరో రమణ సాకే గుడ్ లుకింగ్ తో యువతను ఆకర్షించేలా నటించారని ఎన్నో సినిమాల్లో అవకాశం రావాలని టాప్ హీరోల స్థాయికి ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరో మరియు మ్యూజిక్ డైరెక్టర్ రమణ సాకే మాట్లాడుతూ.. ఈ సినిమాలో 7 సాంగ్స్ ఉన్నాయని, ప్రతి ఒక్కటి సందర్భానికి తగినట్లు చాలా మెలోడీగా వచ్చాయని, సినిమా మ్యూజిక్ మొత్తం ప్రేక్ష కులను మంత్రముద్దుల్ని చేస్తుందని సినిమా చూసేటప్పుడు ఆడియన్స్ వారిని వారు మరిచిపోయి సినిమాలో లీనమైపోతారని ఆ విధంగా ఈ సినిమా ఎంతో హిట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా నేటి పెద్దలకు పిల్లలకు, యువతీ యువకులకు, బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.

డైరెక్టర్ సత్యమార్క మాట్లాడుతూ మా హీరో కొత్త వారు అయినా చాలా బాగా నటించారు. మా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. నిర్మాత సాకే నీరజ లక్ష్మీ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారని చెప్పారు. బి వేణుగోపాల స్వామి లిరికల్ వీడియో లాంచ్ చేసి సపోర్టు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలి అని కోరుకుంటున్నాం అన్నారు. ఇందులో నటీ నటులు హీరో రమణ సాకే, హీరోయిన్ వనిత గౌడ, మరియు జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, జబర్దస్త్ ఫణి, రాణి, సతీష్ సారపల్లి, చిరంజీవి, విక్టర్ ,సుజిత్, ప్రదీప్, బి ఎస్ మన్యం, అవ్వరు సురేష్ తదితరులు నటించారు అని పేర్కొన్నారు. ఈ సినిమా మొత్తం వెస్ట్ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలలో ప్రతి ఒక్కటి అద్భుతమైన లొకేషన్ లో తీశామని చెప్పారు.

Latest News

నేరాల ఛేదనకు కృత్రిమ మేధస్సు.. పోలీసులకు డిజిటల్ శిక్షణ

నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS