Saturday, July 19, 2025
spot_img

అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామని బెదిరింపులు..

Must Read
  • ఆవేదన వ్యక్తం చేస్తున్న బీజేపీ అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి
  • ప్రిస్టేజ్ కంపెనీ, వైష్ణోయి గ్రూప్స్ వారి దౌర్జన్యకాండ..
  • ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదు..
  • ఖాళీ భూమికి హెచ్ఎండీఏ నుండి లేఅవుట్ అనుమతులు..
  • కానీ అక్కడ అక్రమంగా నిర్మిస్తున్నది గేటెడ్ కమ్యూనిటీ..
  • మున్సిపల్ నిబంధనలకు అడ్డంగా తూట్లు..
  • అక్రమంగా గేటెడ్ కమ్యూనిటీ పేరుతో విల్లాల నిర్మాణం..
  • అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దుర్మార్గం..
  • హెచ్ఎండిఏ, మున్సిపల్ కు సంబంధించిన ఖజానాకు తూట్లు..
  • రెండు ఎకరాల వాటర్ బాడీ మర్రివానికుంట స్వాహా..
  • పార్కులు, రోడ్లు, పబ్లిక్ స్థలాలు కాజేసిన ప్రెస్టీజ్ సంస్థ..

అన్యాయాన్ని ప్రశ్నిస్తే అంతం చేస్తారా..? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి..? ఏదైర్యంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు..? ఇలాంటి దుర్మార్గులను ఎవరు వెనుక నుండి నడిపిస్తున్నారు..? అమాయకుల జీవితాలతో ఆడుకునే హక్కు వీరికి ఎవరు కల్పించారు.. నీటి కుంటలను, పార్కులు, రోడ్లు పబ్లిక్ స్ధలాలు కాజేసిన ఇలాంటి సంస్థలను నిలువరించకపోవడం దురదృష్టకరం.. హైడ్రా లాంటి ప్రభుత్వ రంగ సంస్థ దూకుడుకా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్న వారు భయపడకుండా ఇంకా ఇంకా రెచ్చిపోతుండటం దేనికి సంకేతం..?

బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ మండల్ రెవెన్యూకు సంబంధించి మామిడిపల్లి గ్రామం సర్వేనెంబర్స్ : 111, 112, 113, 115, 117/1, 117/2, 117/3, 118/3, 119, 122 గల స్థలంలో.. ప్రెస్టేజ్ గ్రూప్, వైష్ణోయి సంస్థలు సయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేపట్టడం జరిగింది.. అయితే ఇక్కడ జరిగిన అక్రమం ఏమిటంటే “మర్రివానికుంట” విస్తీర్ణం రెండు ఎకరాలను పూర్తిగా చదును చేసి, అక్రమ పద్ధతిలో వెంచర్ చేశారు.. ఈ విషయంపై హైడ్రా ప్రత్యేక దృష్టిసారించాలని స్థానిక జనం గగ్గోలు పెడుతున్నారు.

ప్రెస్టేజ్ గ్రూప్, వైష్ణోయి సంస్థ సయుక్తంగా 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి నుండి లేఅవుట్ అనుమతులు తీసుకొని, గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు తీసుకోకుండా చుట్టూ ప్రహరీ నిర్మించి, గేటెడ్ కమ్యూనిటీలా ప్రకటనలు గుప్పించి ప్రభుత్వానికి కోట్లల్లో పన్ను ఎగవేయడం జరిగింది.. ఈ విషయంపై స్థానిక మున్సిపాలిటీ బడంగ్పేట్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేస్తే నోటీసులు ఇచ్చి అటువైపు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొంది.. ఈ విషయంపై మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే పెద్దవారు ఉన్నారు మా ఉద్యోగాలు ఉడుతాయని జవాబు ఇవ్వడం కొసమెరుపు.. ఈ అవినీతి అక్రమాలలో ఎవరి వాటా ఎంత అనే విషయం ఉన్నతాధికారులకు అందిన వాటాలు ఎంత అన్నది లోతైన పరిశోధన చేసి.. అవినీతికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు..

కాగా ఇదే విషయమై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ మద్ది సబితా భర్త అయిన మద్ది రాజశేఖర్ రెడ్డి.. గత 5 నెలల నుంచి మామిడిపల్లిలో ప్రెస్టేజ్ కంపెనీ, వైష్ణోయి గ్రూప్స్ వారు మామిడిపల్లిలో చేస్తున్న దారుణంపై, అక్రమ నిర్మాణాలపై పోరాటం చేస్తున్నారు.. వారు అందించిన వివరాల ప్రకారం మర్రివానికుంట మూడు ఎకరాలు మాయం చేశారు.. సర్వే నెంబర్ 111, 122 కుంట మొత్తము ప్లాటింగ్ చేయడం జరిగింది.. ఇక సర్వేనెంబర్ 141 లో ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు రెండు ఎకరాలు ల్యాండ్ కబ్జా చేసి ప్లాటింగ్ చేయడం జరిగింది..

అంతేకాకుండా నల్లవాగు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కొత్తచెరువు, మర్రివాని కుంటా నుండి జల్పల్ చెరువులకు పోయే వాటర్ వాగు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి.. సర్వే నెంబర్ 32 హనుమాన్ దేవాలయం భూమి కబ్జా చేసి వెంచర్ కు రోడ్డు వేయడం జరిగింది.. 32 నెంబర్ సర్వేనెంబర్ 1-20 భూమి రికార్డులో గవర్నమెంట్ ల్యాండ్ అని చూపిస్తుంది.. 2013లో రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి మీద చేయడం జరిగింది. ఇది దేవాలయం భూమి.. సర్వేనెంబర్ 10 మామిడిపల్లిలో వైష్ణోయి గ్రూప్ కబ్జా చేయడం జరిగింది.. దాదాపు 200 కోట్ల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేశారు.. ఈ విషయం పై కంప్లైట్ ఇస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు అని మద్ది రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..

ఫిర్యాదు చేసిన మద్ది రాజశేఖర్ రెడ్డి

తెలంగాణ చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్ కి, ఆర్డిఓ కి, ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్‌మెంట్ వారికి, బడంగ్ పేట కమిషనర్ కి, బాలాపూర్ ఎమ్మార్వో కి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్లు సహకరించడం లేదు.. ఒక్కొక్క అధికారికి మూడు నుంచి నాలుగు సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కనీసం నోటీస్ ఇచ్చి, కేసులు కూడా పెట్టని పరిస్థితి.. రెవెన్యూ ఆఫీసర్ ఎమ్మార్వో కి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె ఎటువంటి ఆక్షన్ తీసుకోవడం లేదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అధికారులు కొమ్ముకాస్తున్నారని అనిపిస్తుంది.. ఎమ్మార్వో తక్షణమే స్పందించి ప్రభుత్వ భూములు కాపాడవలసిందిగా ఆయన కోరుతున్నారు..

తాను ప్రభుత్వ భూములు కాపాడుమని దరఖాస్తులు ఇచ్చినందుకు తమ కుటుంబాన్ని భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.. తనకు ప్రాణహాని ఉందని తెలంగాణ డీజీపీకి, రాచకొండ కమిషనర్ కి, ఏసీపీ మహేశ్వరంతో సహా స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.. అయినా సరే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆయన వాపోయారు.. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. ప్రిస్టేజ్ కంపెనీ, వైష్ణోయి గ్రూప్ వారు హనుమాన్ జయంతి శోభయాత్ర రోజున తనపై దాడి చేయడానికి ప్రయత్నించినారని, తనకు వారి నుండి ప్రాణహాని ఉన్నదని, కావున పోలీసులతో పాటు ఇతర విభాగాల అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రాధేయపడుతున్నారు.

Latest News

పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని ఎలా అంటారు

ఇదికాంగ్రెస్‌ విధానాలకు పూర్తిగా వ్యతిరేకం రేవంత్‌ వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా రాజగోపాల్‌ అభ్యంతరం పదేళ్లూ నేనే సిఎం అని రేవంత్‌ రెడ్డి అనడం కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు వ్యతిరేకం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS