దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని ఎనిమిది స్పా సెంటర్లపై రాత్రి ఏకకాలంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆయా కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది, థెరపిస్టులతో పాటు కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. సిఐ కే. సైదులు తెలిపిన వివరాల ప్రకారం వాసవి కాలనీ అష్టలక్ష్మి దేవాలయం సమీపంలోని మోజో వెల్ నెస్ స్పా, విక్టోరియా మెట్రో స్టేషన్ సమీపంలోని స్కై బ్యూటీ అండ్ స్పా, న్యూనాగోల్ ప్రభాత్ నగర్ లోని ఏ పీస్ ఫుల్ ఫ్యామిలీ సెలూన్ అండ్ స్పా, చైతన్యపురి సాయినగర్ కాలనీ శివాజీ విగ్రహం సమీపంలోని బ్రైట్ నెస్ బ్యూటీ స్పా, లవి బ్యూటీ స్పా, అల్కాపూర్ చౌరస్తా వద్ద హెచ్డిఎఫ్సీ బ్యాంక్ పైన శ్రీ ఎలైట్ స్పా అండ్ సెలూన్, నాగోల్ క్రాస్ రోడ్డు సమీపంలోని వేరీ జోన్ స్పా కేంద్రాలపై దాడులు నిర్వహించామని తెలిపారు. ఆయా స్పా కేంద్రాలలో రికార్డులు సరిగ్గా నిర్వహించకపోవడం, ఓపెన్ స్థలంలో మసాజ్ చేయకుండా గదులలో డోర్లు వేసి మసాజ్ చేయడం, ఆయా గదులను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, క్రాస్ మసాజ్ చేయడం, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా కేంద్రాలు నడపడం తదితర లోపాలు గుర్తించి ఆయా కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా స్పా కేంద్రాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.