Thursday, June 5, 2025
spot_img

‘రాజా సాబ్’.. డిసెంబర్ 5న రిలీజ్..

Must Read

ఈ నెల 16న ఉదయం 10.52కి టీజర్ విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ “రాజా సాబ్” డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. టీజర్‌ను ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు విడుదల చేయనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్ మెంట్ తో రెబెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ప్రభాస్ డబ్బులతో నిండి ఉన్న గదిలో ఫెరోషియస్ గా కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది.

“రాజా సాబ్” రిలీజ్ డేట్, టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో దీని మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. “రాజా సాబ్”తో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు. నటీనటులు.. ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్. టెక్నికల్ టీమ్.. ఎడిటింగ్-కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ-కార్తీక్ పళని, మ్యూజిక్-తమన్, ఫైట్ మాస్టర్-రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్, ప్రొడక్షన్ డిజైనర్-రాజీవన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్-ఎస్ కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-టీజీ కృతి ప్రసాద్, పీఆర్ఓ-జీఎస్ కే మీడియా(సురేష్- శ్రీనివాస్), వంశీ కాకా, కో ప్రొడ్యూసర్-వివేక్ కూచిభొట్ల, ప్రొడ్యూసర్-టీజీ విశ్వప్రసాద్, రచన, దర్శకత్వం-మారుతి.

Latest News

‘రానా నాయుడు సీజ‌న్‌2’ ట్రైల‌ర్ రిలీజ్

ఫిక్స‌ర్ మ‌ళ్లీ తిరిగొచ్చాడు.. అయితే ఈసారి త‌న కుటుంబం కోసం. 2023లో నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన సిరీస్ ‘రానా నాయుడు’ ఎంత పెద్ద ఆద‌ర‌ణ‌ను పొందిందో తెలిసిందే....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS