రిటైర్డ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చిప్ప రాజమౌళిగౌడ్, చంద్రకళ దంపతుల ఏకైక కుమార్తె జాహ్నవి వివాహం కరీంనగర్ ఎస్ఐ అగస్త్య భార్గవ్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్‌లోని మైత్రి కన్వెన్షన్ హాల్‌లో గురువారం ఉదయం 7 గంటల 56 నిమిషాలకు జరిగిన ఈ పెళ్లి వేడుకకు బంధుమిత్రులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అద్భుతంగా ఏర్పాటుచేసిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇరు కుటుంబాల వైపు నుంచి పెద్దలు, పిల్లలు, శ్రేయోభిలాషులు భారీగా పాల్గొని కళ్యాణ వేదికను కనులపండువగా అలంకరించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ శుభకార్యాన్ని దిగ్విజయం చేసిన ప్రతిఒక్కరికీ రాజమౌళిగౌడ్ దంపతులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. టీజీఎస్ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రాజమౌళిగౌడ్.. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. అదే విధంగా ఐరేని శ్రీనివాస్ గౌడ్, లక్ష్మి దంపతులు.. వచ్చినవారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.