Wednesday, July 23, 2025
spot_img

రికార్డు స్థాయిలో మహిళల ఉచిత ప్రయాణం

Must Read

ఆడబిడ్డలకు సిఎం శుభాకాంక్షలు

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మీ స్కీమ్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేసింది. 18 నెలలుగా ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా సాగుతోన్న మహాలక్ష్మీ స్కీమ్‌ అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ స్కీములో భాగంగా ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. మహాలక్ష్మీ స్కీమ్‌ ఈ అరుదైన ఘనత అందుకోవడంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. 18 నెలల ప్రజా పాలనలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి సీఎం రేవంత్‌ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Latest News

‘హరిహర వీరమల్లు’: నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్‌కు సీబీఎఫ్‌సీ సభ్యులు అక్కల సుధాకర్ అభినందనలు

తెలుగునాట సినిమా, రాజకీయం ఎప్పుడూ కలిసే ప్రయాణిస్తాయి. ఈ రెండు శక్తులు కలిసినప్పుడు, అది ఒక ప్రభంజనం అవుతుంది. ప్రస్తుతం ఆ ప్రభంజనానికి కేంద్ర బిందువుగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS