ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రోడ్లు మరియు భవనాల శాఖలో సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీ తిరుమలయ్య, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ తిరుమలయ్యకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ తిరుమలయ్య మాట్లాడుతూ, “పదవీ విరమణ తర్వాత కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న నా తపనకు ఈ AI బూట్ క్యాంప్ సరైన వేదికైంది. సాంకేతిక పరిజ్ఞానం ఏ వయసు వారికైనా అందుబాటులో ఉండాలనడానికి ఇదే నిదర్శనం. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు నా జ్ఞానాన్ని విస్తృతం చేశాయి. నిరంతరం నేర్చుకోవాలనే స్ఫూర్తితోనే ముందుకు సాగుతాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.