Thursday, August 14, 2025
spot_img

ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల

Must Read
  • భారీ వర్షాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
  • అధికారుల‌తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు, కాలువలు పొంగిపొర్లుతుండగా, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. రోడ్లకు నష్టం, రవాణా అంతరాయం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాతావరణ శాఖ మరుసటి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.1 కోటి రూపాయలు విడుదల చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను సహాయక చర్యలు, రక్షణ కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంటుంది.

ఇక పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావుతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల పరిస్థితులపై కలెక్టర్ల నుండి నేరుగా వివరాలు తెలుసుకున్నారు.

మంత్రి మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఒక ప్రాణం కూడా నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి నిరంతరం సమీక్ష చేస్తున్నారని, అవసరమైతే ఆయన స్వయంగా సందర్శిస్తారని తెలిపారు. ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు కూడా సమావేశంలో మాట్లాడుతూ, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని పరిస్థితులను రోజువారీగా నివేదించాలని, సహాయక చర్యల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు.

ప్రస్తుతం, వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో పాఠశాలలు మూసివేయడం, రవాణా అంతరాయం, పంట పొలాల్లో నీటి నిల్వలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేసి, అవసరమైతే అదనపు బృందాలను పంపే ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి కూడా వరద ప్రభావిత ప్రాంతాలపై నిరంతరం సమీక్ష చేస్తున్నారని తెలిపారు.

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS