- చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సమాజంలోని ప్రతి ఒక్కరు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు స్ఫూర్తి గా తీసుకని ముందుకు వెళ్లాలని సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథి గా హాజరాయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూల మాలవేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలలో పోరాట పటిమ పై దశ, దిశ, నిర్దేశం చేస్తూ వారికి న్యాయం చేసేందుకు కృషి చేశారని అన్నారు. సర్వాయి పాపన్న అట్టడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి కృషి చేశారని, కోటలు కట్టించారని, సాగునీటి మీద పోరాటం చేశారని తెలిపారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సమస్యలపై దృష్టి పెట్టి సమాజంలో వెలుగు నింపాలని, ప్రజలలో ప్రేరణ తీసుకోచ్చి సమాజంలో మార్పులు తీసుకురావాలని , అందుకు చదువు ఒకటే పరిష్కారం అని అన్నారు.చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, కొత్త తరానికి ఒక బలమైన జీవితాన్ని ఇవ్వడానికి కృషి చేయాలని కోరారు. వివిధ అభివృద్ధి పనులు, శాఖల వారి పనులు, విద్య ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, సర్దార్ సర్వాయి పాపన్న చేసిన మంచి పనులను స్ఫూర్తిగా తీసుకుని పిల్లలకు చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాం బాబు, బీసీ సంక్షేమ అధికారి ఎల్. శ్రీనివాస్, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి దయానంద రాణి, డి ఆర్ డి ఎ పిడి, వి.వి. అప్పారావు, డీఈవో అశోక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, సిపిఓ కిషన్, డీఎఫ్ఓ సతీష్, బొర్రా రాములు, గోపా జిల్లా ప్రెసిడెంట్, వెలుగురి గోవిందు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రెసిడెంట్, వెంకన్న గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ, డాక్టర్ బంటు కృష్ణ, జర్నలిస్ట్ సంఘం జిల్లా సెక్రెటరీ, తన్నీరు రామ ప్రభు, బీసీ సంక్షేమ శాఖ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, కంచుకోట వెంకట్, పోసల సంఘం ప్రెసిడెంట్, బీసీ సంఘం నాయకులు డా,, రామ్మూర్తి, చలమల నరసింహ, సత్యనారాయణ పిళ్ళై అడ్వకేట్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.