Monday, August 11, 2025
spot_img

సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్న వారికి అండ

Must Read
  • రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం ద్వారా సాయం
  • మెయిన్స్‌కు ఎంపికైన వారికి లక్ష చెక్కు అందించిన భట్టి

సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం కింద సివిల్స్‌-2025లో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష చెక్కులను మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్‌-2024 విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం ద్వారా అభ్యర్థులకు సాయం అందిస్తామన్నారు. ఈ పథకాన్ని విజయవంతంగా రెండో సంవత్సరం అమలు చేస్తున్నామన్నారు. సివిల్స్‌ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సాయం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఐఏఎస్‌ అంటే ఉద్యోగం కాదని, సమాజానికి అందించే ఓ బాధ్యత అని భట్టి విక్రమార్క అన్నారు. మానవ వనరులు అత్యంత బలమైన పెట్టుబడి అని, మానవ వనరులకు మంచి తర్ఫీదు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు.

గతేడాది అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్‌ అయ్యారని, 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్‌ అవ్వాలన్నారు. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు. నిస్సహాయకులకు సేవ చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతున్న వాళ్లకు ఎంతో కొంత సాయం అందించాలని మేం ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం సాయం కాకపోయినా.. కొంత మీకు అండగా ఉండాలని అభయ హస్తం ఇస్తున్నాం. మెయిన్స్‌కు వెళ్తున్న వారికి లక్ష సాయం చేస్తున్నాం, కొంత కొచించ్‌కి ఉపయోగ పడుతుందని ప్రభుత్వ ఆలోచన. లాస్ట్‌ ఇయర్‌ అభయ హస్తం పొందిన వారిలో 10 మంది సెలెక్ట్‌ అయ్యారు. 178 మందిలో గత ఏడాది కంటే ఎక్కువ మంది సెలెక్ట్‌ అవ్వాలి. సివిల్‌ సర్వెంట్‌ల సమావేశాల్లో కొందరు ఐఏఎస్‌లను రోల్‌ మోడల్‌గా చెప్తారు. మాధవరావు, ఎస్‌ఆర్‌ శంకరన్‌ లాంటి వాళ్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. సమాజానికి నిబద్ధతతో చేసిన సేవ ప్రజల్లో నిలిచిపోతుంది. ఐఏఎస్‌ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత. నిస్సహాయకులకు సేవ చేయడం ల‌క్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడే ప్రభుత్వ ల‌క్ష్యాలు సక్సెస్‌ అవుతాయి. మాకు ఎంత చేయాలి అని ఉన్నా.. ఐఏఎస్‌లలో నిబద్ధత లేకుంటే లక్ష్యం చేరుకోలేం. శంకరన్‌ లాంటి వాళ్లు సంక్షేమ శాఖల్లో పని చేశారు. మిషన్‌ లాగ పని చేస్తే.. ప్రజలు కూడా మిషన్‌ లాగే మర్చిపోతారు. సవాళ్లను అధిగమించి లక్ష్యం సాధించండని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ నుంచి.. ఇవాళ సివిల్స్‌కి వెళ్లే వారి వరకు అందరికీ ప్రభుత్వం సహకారం అందిస్తున్నాం. 55 యంగ్‌ ఇండియా స్కూల్స్‌ నిర్మాణ కి ఇప్పటికే టెండర్లు పిలిచాము. రైతు కొడుకు రైతే అవుతున్నాడు. మేము ఐదేళ్లు.. పదేళ్లు పదవుల్లో ఉంటాం. సివిల్స్‌ సాధించి మీరు ప్రజల సేవలో ఉండండి. కాన్ఫిడెన్స్‌తో సివిల్స్‌ ప్రిపేర్‌ అవ్వాలి. డిల్లీలో నా క్వార్టర్స్‌ను చదువుకునే వారికే ఇచ్చా. నా క్వార్టర్స్‌లో ఉండి చదువుకున్న ఇద్దరు ఇప్పుడు నా జిల్లాలోనే సర్వీసులో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Latest News

సిఎం రేవంత్‌తో పిసిసి చీఫ్‌ బేటీ

బిసి రిజర్వేషన్లు, తాజా రాజకీయాలపై చర్చ తాజా రాజ‌కీయ‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS