Monday, August 4, 2025
spot_img

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

Must Read
  • రాహుల్‌ వ్యాఖ్యలపై సుప్రీం ఘాటు హెచ్చరిక
  • ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు

సుప్రీంకోర్టు సోమవారం రాహుల్‌ గాంధీకి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2020 గల్వాన్‌ వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి ఆయన చేసిన కామెంట్స్‌ కారణంగా ఈ హెచ్చరిక చేసింది. రాహుల్‌, తన భారత్‌ జోడో యాత్రలో చైనా 2,000 చదరపు కిలోవిూటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని, ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని సరెండర్‌ చేశారని పేర్కొన్నారు. ఆ మాటలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఏజీ మసీప్‌ాల బెంచ్‌ రాహుల్‌ని సీరియస్‌గా ప్రశ్నించింది. 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తీసుకుందని మీరు ఎలా తెలుసుకున్నారని ప్రశ్నించింది? మీరు నిజమైన భారతీయులైతే అలా మాట్లాడరు కాదా అని జస్టిస్‌ దత్తా అడిగారు. మీరు అక్కడ ఉన్నారని, మీ దగ్గర ఏమైనా నమ్మదగిన ఆధారాలు ఉన్నాయా అని అడిగింది.

రాహుల్‌ తరపున సీనియర్‌ అడ్వకేట్‌ అభిషేక్‌ సింఫ్వీు వాదించారు. రాహుల్‌ అలాంటి మాటలు చెప్పకపోతే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉంటారని సింఫ్వీు అన్నారు. దీనికి జస్టిస్‌ దత్తా మరి ఇలాంటివి పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అయినా, ఈ కేసును కొట్టివేయాలన్న రాహుల్‌ విజ్ఞప్తిపై కోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసు కొనసాగనుందని చెప్పింది. సింఫ్వీు, ఈ కేసులో కొన్ని తప్పులు జరిగాయని చెప్పారు. పోలీసులు రాహుల్‌కి ముందస్తు విచారణ అవకాశం ఇవ్వకుండానే కేసు నమోదు చేశారని వాదించారు.

గతంలో, మే నెలలో అలహాబాద్‌ హైకోర్టు కూడా రాహుల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. లక్నోలో ప్రత్యేక కోర్టు రాహుల్‌కు ఫిబ్రవరిలో సమన్స్‌ జారీ చేసి, ఆయనపై విచారణకు ఆదేశించింది. హైకోర్టు జడ్జి సుభాష్‌.. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అంటే సైన్యాన్ని అవమానించేలా మాట్లాడే హక్కు కాదని పేర్కొన్నారు. ఈ కేసు మొదట 2022 డిసెంబర్‌లో ఉదయ్‌ శంకర్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో బయటకొచ్చింది. రాహుల్‌ గాంధీ సైన్యం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. రాహుల్‌ మాత్రం ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమని చెప్పారు. రాహుల్‌ ఈ విషయాన్ని పలుమార్లు పునరావృతం చేశారు. 2023 జనవరిలో జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కూడా, చైనా మన భూమిని ఆక్రమించిందన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించింది.

Latest News

ఖాజాగూడలో పిడుగు ప్రమాదం

భయాందోళనలో స్థానిక ప్ర‌జ‌లు నగర శివారులోని ఖాజాగూడలో సోమవారం సాయంత్రం పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. లంకోహిల్స్ సర్కిల్‌లోని హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS