అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయ భద్రతా సిబ్బంది భారతీయ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించారు. నేల మీద పడేసి, చేతులను వెనక్కి గుంజి, చిత్రహింసలు పెట్టారు. తర్వాత ఇండియాకి పంపించేశారు. ఈ దారుణాన్ని కునాల్ జైన్ అనే మరో భారతీయుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. కునాల్ జైన్ తన పోస్టులో...
రోజుకు 3 వేల మందిని అదుపులోకి తీసుకోవాలని లక్ష్యం
అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చినవారిపై ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 2,200 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిత్యం కనీసం 3 వేల మందిని అరెస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిని ముందుగా.. ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ (ఏటీడీ) ప్రోగ్రాం కింద రిజిస్టర్...
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అమెరికాలోని డాలస్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అమెరికాలోనే అతిపెద్ద బాపూజీ విగ్రహం డాలస్‌లో ఉంది. యూఎస్ పర్యటనలో భాగంగా కేటీఆర్ జాతిపిత విగ్రహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అహింస, సత్యాగ్రహంతో భారతదేశ ప్రజలందరినీ గాంధీజీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, బానిస బతుకులకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తీసుకొచ్చేందుకు పాటుపడ్డారని కేటీఆర్ కొనియాడారు. అందుకే...
సంచలనం సృష్టిస్తున్న ఒక న్యూస్ ఛానల్ వార్తా కథనం..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లేఖ రాసినట్లు కథనం..
కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ ప్రకంపనలు
పరిధి దాటి టెలికాస్ట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగివుందా..?
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారా..?
ఛానల్ యాజమాన్యంపై చర్యలు...
21, 22 తేదీల్లో ఖారారైనట్లు వెల్లడి
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈనెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యం యూఎస్‌లో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్ ఖేడా గురువారం ఎక్స్ వేదికగా...
స్వీయ బిష్కరణ పథకం అందచేస్తామని ప్రకటన
విమాన ఖర్చులతో పాటు, దారి బత్తెం ఇస్తామని వెల్లడి
అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా వారికి ఓ బంపర్ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే స్వచ్ఛందంగా అమెరికా వీడి తమ స్వదేశానికి వెళ్లిపోతారో.. వారికి విమాన టికెట్లతో పాటూ...
ట్రంప్ చర్యలతో స్వదేశంలోనూ వ్యతిరేకత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ఆయన స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు...
హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందే హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయంలో మంచి అనుభవం ఉందని రష్యా అద్యక్షుడు పుతిన్ తెలిపారు. కజికిస్తాన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, డొనాల్డ్ చాలా తెలివైన వాడని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యనించారు. ఇప్పుడు...
భారతదేశంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్ సహా ఏడుగురు $250 మిలియన్ల (రూ. 2,100 కోట్లు) లంచాన్ని అధికారులకు ఆఫర్ చేశారంటూ,అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపింది. పెట్టుబడిదార్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించింది. నిందితులు...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...