తెలుగులో తొలి నవల రచనకు నాంది పలికిన గొప్ప కవి ఆయన. మొదటి స్వీయ చరిత్ర రాసిన మహోన్నత వ్యక్తి ఆయనే. తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కూడా ఆయనే. మొట్ట మొదటి వితంతు వివాహం జరిపించిన గొప్పతనం ఆయనదే. ఆయనే నవయుగ వైతాళికుడిగా ప్రఖ్యాత గాంచిన కందుకూరి వీరేశలింగం పంతులు. బాల్యవివాహాల రద్దుకోసం...