ఖైరతాబాద్ మహగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దీంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది.వరుసగా సెలవులు ఉండడంతో భక్తులు మహగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తారు.హైదరాబాద్ నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సాయింత్రం వరకు భక్తుల సంఖ్య...