29 జనవరి “భారతీయ వార్తాపత్రికల దినోత్సవం” సందర్భంగా
ఉదయం తలుపులు తెరవగానే వార్తాపత్రిక శుభోదయం అంటూ ముడిచుకుపోయి పలకరిస్తుంది. ప్రతి రోజు ఉదయం వార్తల విందును వడ్డిస్తుంది. దినపత్రిక చూడని రోజు ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. వార్తాపత్రిక రాని వేళ మనసు నిలవదు, దినచర్య సజావుగా సాగదు. కాఫీ చప్పరిస్తూ పేపర్ చదివితే ఆ...