జూలై 28, జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా
మానవ జన్మకు పరమార్ధం మహిలో ఉన్నతంగా జీవించడమే. ఉన్నత జీవనమంటే కోట్లు గడించడం కాదు.వ్యక్తిత్వంతో వికసించడం. మూలాలను మరచి పోయి,సంస్కారం లోపించి,కృతజ్ఞత మరచి జీవించడం వలన జీవితానికి సార్ధకత చేకూరదు. జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. సకల జీవరాశుల్లో మానవ జన్మకున్న విశిష్టత ఏ ఇతర జీవరాశులకు...