వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ స్కూళ్లు. విద్యా హక్కు చట్టానికి తూట్లు. యథేచ్ఛగా పుస్తకాలు, టై, బెల్టుల విక్రయాలు.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. అందరి కుమ్మక్కుతోనే జరుగుతోంది ఈ తతంగం అంటూ జోరుగా ప్రచారాలు. వ్యవస్థలో అన్నీ లోపాలే. పేదవాడికి అందని ద్రాక్షలా మారిన ప్రైవేట్ బడుల్లో సదువులు. ప్రభుత్వాలేమో ప్రభుత్వ బడుల్లో...
విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేశ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్‌టీఈ వచ్చి 16 ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాహక్కు చట్టం అమలులో...