20 మార్చి “ప్రపంచ ఊరపిచ్చుకల దినం” సందర్భంగా
గ్రామీణ మానవ నాగరికతతో విడదీయరాని బంధాలను పెనవేసుకున్నాయి చలాకీ బుల్లి అందాల ఊర పిచ్చుకలు. ఇంటి కిటికీలు, బాల్కనీలు, పెరటి తోటలు, పూల చెట్లు, గేట్లు, చేదబాయి, పిట్టగోడల వెంట ఉదయమే దర్శనమిస్తూ ఆ ప్రాంతాలకు శోభను చేకూర్చుతుంటాయి అందమైన ఊర పిచ్చుకలు. గ్రామీణుల కుటుంబ సభ్యుల...