ఆధార్ వివరాలు తీసుకోమంటే విమర్శలా
భూమన వ్యాఖ్యలపై మండిపడ్డ భాను ప్రకాశ్
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో ఉగ్రదాడులు జరిగే...
రూ.2.40 కోట్ల విలువైన ఆభరణాలు అందజేత
చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ దాతృత్వం
భక్తి, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మంగళవారం మరో విలక్షణమైన శ్రద్ధార్పణ జరిగింది. చెన్నైకు చెందిన ప్రముఖ సంస్థ సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ తరఫున శ్రీవారికి సుమారు రూ.2.40 కోట్లు విలువైన రెండు బంగారు ఆభరణాలు ఒకటి శంఖం, మరొకటి చక్రం...
భయాందోళనలో శ్రీవారి భక్తులు
గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుత పులులు సంచారం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అలిపిరి జూ పార్క్‌కు సమీపంలోనే చిరుత సంచరించింది. గురువారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ఫారెస్ట్...
సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి
తిరుమలలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మలయప్పస్వామి వారు ఉభయదేవేరులతో సర్వభూపాల వాహనంపై వేంచేశారు. మరో పల్లకిలో సర్వ సైన్యాధ్యక్షడు విష్వక్సేనులు దక్షిణ అభిముఖంగా వేంచేశారు. ఉత్సవ మూర్తులతో పాటు మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. జీయర్లు ఊరేగింపుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై...
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (జూన్ 16 సోమవారం) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దేశం అభివృద్ధి చెంది, విశ్వగురువుగా అవతరించాలని శ్రీవారిని కోరుకున్నానని దర్శనానంతరం పీయూష్ గోయల్ మీడియాకు తెలిపారు.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండలవాడి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన కొండ మీదికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తోంది. ఈ ప్రక్రియను శుక్రవారం (జూన్ 6) నుంచి ప్రారంభించింది. దివ్యదర్శనం టోకెన్ కేంద్రాన్ని శ్రీవారి మెట్టు నుంచి ఇక్కడికి మార్చడంపై...
టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు.. సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాన్ష్ ప్రతి పుట్టిన రోజున తిరుమలలో ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు టిటిడి...
తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను టీటీడీ నిషేదించింది. తిరుమలలో మీడియాను ఉద్దేశించి ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయం పరిసరాల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు ఈ చర్య అవసరమని టీటీడీ పేర్కొంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఛైర్మన్ బీఆర్ నాయుడు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి వెళ్ళిన అయిన రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.
తిరుమల కల్తీ లడ్డూ వివాదం పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బృందంలో సీబీఐ నుండి ఇద్దరు , రాష్ట్ర...