Thursday, August 14, 2025
spot_img

తీగ లాగితే డొంక కదిలింది

Must Read
  • తీగల కృష్ణారెడ్డి కళాశాల అక్రమంగా ఫీజుల దోపిడి
  • కళాశాల అదనపు ఫీజుల వసూలు, రంగంలోకి ప్రభుత్వ శాఖ
  • అక్రమ ఫీజు వసూళ్లపై బీసీ వెల్ఫేర్ నోటీసులు జారీ
  • ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు రూ.39,000.
  • ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రూ.39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది.
  • బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం రూ.14,900 మాత్రమే రీయింబర్స్‌మెంట్ చేస్తుంది.
  • బీసీ, ఓసీ విద్యార్థులు కళాశాలకు చెల్లించాల్సిన వ్యత్యాసం రూ.24,100 మాత్రమే (రూ.39,000 – రూ.14,900).
  • టీకేఆర్ కళాశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థి నుంచి అదనంగా రూ.12,500 వసూలు.
  • అక్రమంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్

ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ప్రజలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలవాలి. వారు చేసే ప్రతి చట్టం, తీసుకునే ప్రతి నిర్ణయం సమాజ శ్రేయస్సును, ముఖ్యంగా పేద, బడుగు వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని ఉండాలి. అలాంటి ఉన్నతమైన స్థానాలలో పనిచేసిన అనుభవజ్ఞులైన నాయకులు, చట్టం మరియు ధర్మం తప్పినప్పుడు, అది సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

ఈ నేపథ్యంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా, మహేశ్వరం శాసనసభ్యునిగా కీలక పదవులు చేపట్టిన సీనియర్ నాయకులు తీగల కృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒకవైపు ప్రజా ప్రతినిధిగా, మరోవైపు ‘టీకేఆర్’ విద్యాసంస్థల వ్యవస్థాపకునిగా ఆయనకు చట్టాలపై, ప్రభుత్వ నియమ నిబంధనలపై, విద్యా వ్యవస్థపై మరియు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులపై పూర్తి అవగాహన ఉందనడంలో సందేహం లేదు.

అయితే, ఇంతటి అనుభవం, అవగాహన ఉన్న నాయకుడి విద్యాసంస్థలోనే ప్రభుత్వ నిబంధనలను, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ధిక్కరించి, విద్యార్థుల నుంచి అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి. విద్యాదానం చేయాల్సిన పవిత్ర రంగంలో వ్యాపార ధోరణి ప్రబలడం, అందులోనూ చట్టాలను కాపాడాల్సిన నాయకులే వాటిని ఉల్లంఘించడం సమర్థనీయమేనా?


ఈ సంఘటన కేవలం డబ్బు వసూలుకు సంబంధించినది మాత్రమే కాదు, నాయకుల నైతిక బాధ్యతకు, వారి జవాబుదారీతనానికి ఒక గీటురాయి. ప్రజా నాయకులుగా చలామణి అవుతున్న వారి నిజమైన లక్ష్యం ప్రజా సేవనా లేక స్వార్థ ప్రయోజనాలా? అనే మౌలికమైన ప్రశ్నను ఇది లేవనెత్తుతోంది. ఇలాంటి చర్యల ద్వారా నాయకుల నిజస్వరూపం ప్రజలు గమనిస్తున్నారు.

కళాశాల అదనపు ఫీజుల వసూలు, రంగంలోకి ప్రభుత్వ శాఖ
హైదరాబాద్‌లోని తీగల కృష్ణారెడ్డి (టీకేఆర్) పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ నిబంధనలను, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి బీసీ, ఓసీ విద్యార్థుల నుంచి అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం పాలిటెక్నిక్ ట్యూషన్ ఫీజును వార్షికంగా రూ. 39,000గా నిర్ణయించింది. బీసీ, ఓసీ విద్యార్థులకు ప్రభుత్వం రూ. 14,900 రీయింబర్స్‌మెంట్ చేస్తుంది, కాబట్టి విద్యార్థులు చెల్లించాల్సింది కేవలం రూ. 24,100 మాత్రమే. విద్యార్థుల నుండి క‌ళాశాల యాజ‌మాన్యం రూ. 12,500లు వ‌సూలు చేస్తున్న విష‌యంపై బిసి వెల్పేర్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డైరెక్ట‌ర్ విద్యాసంవ‌త్స‌రం 2023-24, 2024-25, 2025-26 విద్యార్థుల నుండి తీసుకున్న ఫీజుల వివ‌రాలు తెలుప‌వ‌ల్సిందిగా టీకేఆర్ క‌ళాశాల‌కు నోటీసులు జారీ చేసింది.

కళాశాల దోపిడీ:
టీకేఆర్ కళాశాల యాజమాన్యం మాత్రం విద్యార్థుల నుంచి రూ. 36,600 వసూలు చేస్తోంది. ఇది ప్రతి విద్యార్థిపై అదనంగా రూ. 12,500 భారం మోపుతోంది. ఈ ఫీజుల దోపిడీపై ‘ఆదాబ్ హైదరాబాద్’ పత్రికలో వచ్చిన కథనంతో స్పందించిన రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ, కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, ఫీజుల వసూళ్లపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.అక్రమంగా వసూలు చేసిన ఫీజును విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని, కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS