ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో తెలియడానికి తెలంగాణనే నిదర్శనం
– లండన్ ఆక్స్‌ఫర్ట్ ఇండియా ఫోరమ్ సదస్సులో తెలంగాణ విజయగాథను వినిపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్
దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడింది

స్వతంత్ర భారతంలో అద్భుతమైన ఆర్థిక పురోగతి, ప్రగతిని చూపించిన రాష్ట్రం తెలంగాణ
అహింసాయుతంగా జరిగిన ఒక మహా అద్భుత పోరాటం తెలంగాణ ఉద్యమం

తెలంగాణ విజయాన్ని కేవలం అంకెలతో మాత్రమే చెప్పుకుంటే సరిపోదు
ఆత్మగౌరవం, పట్టుదలకు ప్రతిరూపంగా చెప్పుకోవడంతో పాటు లక్షలాది మంది భారతీయులకు భవిష్యత్తుపై భరోసాను ఇచ్చిన విజయగాథ లాగా తెలంగాణను చూడాలి

సబ్బండ వర్ణాల భాగస్వామ్యంతో సాధించిన సమ్మిళిత వృద్ధిలాగా తెలంగాణ విజయాన్ని చెెప్పుకోవచ్చు
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉంది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో కేవలం నాలుగు సంవత్సరాల స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాము

అమెరికా అవతల హైదరాబాద్ లోనే అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ ఉంది
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ-హబ్ హైదరాబాద్ లో ఉంది

ప్రపంచంలోని మూడో వంతు వ్యాక్సిన్ ఉత్పత్తి తెలంగాణలో జరుగుతుంది
ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద టెక్ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ లోనే తమ క్యాంపస్ లను ఏర్పాటుచేశాయి

ఐటీ రంగ ఉద్యోగ కల్పనల్లో వరుసగా రెండు సంవత్సరాల పాటు బెంగళూరుని హైదరాబాద్ దాటింది
కొత్త రాష్ట్రంగా శిథిలాల నుంచి గెలుపు సౌధాలను తెలంగాణ నిర్మించింది

కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో మేము తెలంగాణ రాష్ట్రంగా నూతన ప్రయాణాన్ని మొదలుపెట్టాం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అనుమతుల కోసం ఎన్ని రోజులు పడుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉండేది

కానీ మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 రోజుల్లో అనుమతులు వచ్చేలా చేశాం. ఒకవేళ 15 రోజుల్లో లోపు అనుమతులు రాకపోతే ఆ పరిశ్రమను ప్రారంభించుకోవచ్చు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అవకాశం లేదు
వ్యక్తుల కంటే విధానాలకే మేం ప్రాధాన్యత ఇచ్చాము

భారతదేశంలోని 65% ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. అందుకే మేము వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాము
70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా దాదాపు 75వేల కోట్ల రూపాయలను జమచేసిన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు

మేం తీసుకొచ్చిన ఈ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చింది. అందుకే 2014లో ధాన్యం ఉత్పత్తిలో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ పంజాబ్, హర్యానా దాటి 2022 నాటికి నంబర్ వన్ కు చేరింది
బటర్ ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్పుకున్నట్టే కేసీఆర్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పుకోవాలి

ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనడానికి తెలంగాణ విజయగాథనే నిదర్శనం
కోటి ఇండ్లకు శుద్ధి చేసిన తాగునీటిని అందించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ ఒకటి

80 మీటర్ల సముద్ర మట్టం నుంచి 618 మీటర్లకు నీటిని తీసుకెళ్లే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు
ఇన్ లాండ్ ఫిషరీస్ లో తెలంగాణ నెంబర్ వన్. పారిశ్రామిక అవసరాల కోసం తగినంత నీటిని అందుబాటులో ఉంచిన రాష్ట్రం తెలంగాణ

కేసీఆర్ గారి హయాంలో ఫ్లోరోసిస్ పూర్తిగా నిర్మూలించబడింది
హైదరాబాదు లాంటి నగరానికి నీటి సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని కేసీఆర్ గారు చూపించారు

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రతినిధిగా మీ భాగస్వామ్యం కోసం వచ్చాను. మనం కలిసి అద్భుతాలు చేయవచ్చు
తెలంగాణకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను

ఈ ప్రపంచానికి ఇండియానే భవిష్యత్తు. తెలంగాణ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది